Saturday, April 25, 2015

పాలు నీళ్ళు--1981

సంగీతం::సత్యం
రచన::వీటూరి
గానం::P.సుశీల
తారాగణం::మోహన్‌బాబు,జయప్రద 

పల్లవి:: 

నేనే నేనే నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని
నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
ఆదిశక్తిని ఆగమవర్తిని
నేనే స్త్రీ మూర్తిని..ఈఈఈ

చరణం::1

ప్రణయానికి నే ప్రాణశక్తిని
ప్రళయానికి నే మూలశక్తిని నిర్మూలశక్తిని
వినయానికినే..విమల ధాత్రిని
విమల శీలా..నిత్యాగ్నిహోత్రిని
కల్లోలిత సంసారాజలధిలో ఊళ్ళోలితమో జీవిత నౌకకు
కల్లోలిత సంసారాజలధిలో ఊళ్ళోలితమో జీవిత నౌకకు
ఉత్తర దిక్కున వెలిగే చుక్కని చుక్కానినీ
నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని

చరణం::2

కళకు అంకితం నేనైనా కళంకితను గానూ
అబల అబల అని ఎవరన్నా బలహీనను నే గానూ
పతికి అనురాగవల్లిని సుతుల మురిపాల తల్లిని
పతికి అనురాగవల్లిని సుతుల మురిపాల తల్లిని
తరతరాల వరవరాల నల్లిన భారతీయ సంస్కృతిని
కవిరాయలేని కృతిని రవిచూడలేని ప్రకృతిని
నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
ఆదిశక్తిని ఆగమవర్తిని
నేనే స్త్రీ మూర్తిని..ఈఈఈ

No comments: