సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు
పల్లవి::
నవ్వుతూ వెళ్ళిపో..నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో..తావిలా మిగిలిపో
వేసవిలో మల్లెలా..వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా
నవ్వుతూ వెళ్ళిపో..నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో..తావిలా మిగిలిపో
చరణం::1
మురిపించే చిరునవ్వే పసిపాపలలో అందమూ
పకపకలాడే పాపల నవ్వే బాపూజీకి రూపమూ
పగనైన ప్రేమించు..ఆ నవ్వులు
శిలనైన కరిగించు..ఆ నవ్వులు
వేకువలో కాంతిలా..వేదనలో శాంతిలా
చిరకాలం నవ్వాలి స్వాతిలా..ఆరని జ్యోతిలా
నవ్వుతూ వెళ్ళిపో..నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో..తావిలా మిగిలిపో
చరణం::2
ఉదయించే తూరుపులో కిరణాలన్నీ నవ్వులే
వరములు కోరే దేవుడికిచ్చే హారతి కూడా నవ్వులే
మృతినైనా గెలిచేటి ఈ నవ్వులు నీ పేర మిగిలేటి నీ గురుతులు
నవ్వులతో సంతకం చేసిన..నా జీవితం
అంకితమే చేస్తున్నా..కవితలా తీరని మమతలా
నవ్వుతూ వెళ్ళిపో..నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో..తావిలా మిగిలిపో
వేసవిలో మల్లెలా..వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా
No comments:
Post a Comment