సంగీతం::S.V.కృష్ణారెడ్డి
రచన::సిరివెన్నెల
గానం::K.S.చిత్ర
దర్బారీకానడ::రాగం
పల్లవి::
ఆ..ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా వంకాయేనండీ
ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ..మోజే తీరనిదీ
చరణం::1
అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ..ఈ
ఆఆఆ
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా
ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు
ఆహా ఏమి రుచి..అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
చరణం::2
లేత వంకాయలతో వేపుడు చేసేదా
మపద..దనిసరి రిగరిగగరిస..నిసగప
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు
తెలియగ తెలుపగ తరమా
ఆహా..ఏమి రుచి..అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ..మోజే తీరనిదీ
తాజా కూరలలో..రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా..వంకాయేనండీ
ఆఆఆ
No comments:
Post a Comment