Saturday, February 28, 2015

నీడలేని ఆడది--1974










http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8033
సంగీతం::సత్యం 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి,S.P.బాలు
తారాగణం::నరసింహరాజు,సుధీర్,వరప్రసాద్,ప్రభ,ఉమాదేవి,కల్పన,సీతాలత. 

పల్లవి::

తెరసాప నీడలోన..ఆ..మునిమాపు యేళలోన..ఆ 
యెలుగు నీడల్లాగా..ఆ..యేకమై పోదామా యేకమై పోదామా
యేకమై పోదామా

హోయ్..చక్కనైన చిన్నోడా..పక్కనున్న నావోడా 
కోరినవన్నీ కాదనకుండా యిస్తావా మరి..చేరుకుంటే నీరుగారి పోతావా

చేేప కళ్ళ చినదానా..చింతపువ్వు వన్నెదానా
కోరినవన్నీ కాదనకుండా యిస్తానే అవి..మళ్ళీ మళ్ళీ కోరకుండా చూస్తానే 
  
ఆహుం..హేయ్..ఆహుం..హేయ్..ఆహుం..హేయ్..ఆహుం..హేయ్ 

    
చరణం::1


కదిలే గాలిలోన..నే కరిగే మబ్బునౌతా  
ఆ కరిగే మబ్బుపైన..ఎగిరెగిరే గువ్వనౌతా                
ఎగిరే గువ్వవు..నువ్వైతే..తరిమే డేగ నేనౌతా
నారెక్కల్లోన నిన్ను..వెచ్చగ దాచేస్తా హోయ్
రెతిరి పగలూ..నీ మనసంతా కాజేస్తా 
హోయ్..చేేప కళ్ళ చినదానా..చింతపువ్వు వన్నెదానా
కోరినవన్నీ కాదనకుండా..యిస్తానే 
అవి మళ్ళీ మళ్ళీ కోరకుండా..చూస్తానే  

చరణం::2

ఒయ్యహో..ఒయ్యహో..ఆ..ఒయ్యహో..ఒయ్యహో
పారే యేటిలోన..పొంగారే పాయనౌతా 
ఆ ఏటి పాయలోన..ఎదురీదే చేపనౌతా 
ఈదే చేపవు.. నువ్వైతే...ఐతే  
ఈదే చేపవు నువ్వైతే గాలాన్ని నేనౌతా 
నీ గుండెల్లోకి గురిచూసి..లాగేస్తా  
నీ అందాలన్నీ వడబోసీ..తాగేస్తా 
హొయ్..చక్కనైన చిన్నోడా..పక్కనున్న నావోడా 
కోరినవన్నీ కాదనకుండా..యిస్తావా
నువు కోరినవన్నీ..కాదనకుండా ఇస్తానే  

No comments: