Wednesday, October 08, 2014

జమదగ్ని--1988


సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరిసుందరరామమూర్తి 
Film Directed By::BharathiRaja
గానం::రాజ్ సీతారాం, S.జానకి
తారాగణం::కృష్ణ,రాధ,సుమలత.

పల్లవి::

ఏఏలా ఇంత దూరం..నీవే నాకు ప్రాణం 
ఏలా ఇంత దూరం..నీవే నాకు ప్రాణం
వేర్ ఆర్ యూనౌ..యు టెల్ మీ నౌ..ఒ
వేర్ ఆర్ యూనౌ..యు లవ్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ..ఆ
ఏలా ఇంత దూరం..నీవే నాకు ప్రాణం 

చరణం::1

చేమంతి పూదోటలో సాగే..హేమంత రాగానివై
లేమంచు కవ్వింతలే రేగే..నా ప్రేమ గీతిలా
దోసిళ్లలోని ఆశలన్నీ..కౌగిళ్ల పూసి రాలిపోయె
నీకళ్ళలోని ఊసులన్ని..నా పెళ్ళినాటి బాసలాయె 
పారాణిలా పదాలే తాకీ.. రేరాణిలా సుఖాలే పూసీ..
నీ పైటతో పదాలే రాసి..ఆ పాటలో స్వరాలే పోసీ
ముద్దాడుకున్నాయిలే..ప్రేమ క్రీనీడలై
వేర్ ఆర్ యూనౌ..యు టెల్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ..యు టెల్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ..ఆ

చరణం::2

వేసంగి నిట్టూర్పులో..ఏదో సన్నాయి పాడిందిలే 
ఆషాఢ నీరెండలో..పూసే సంపెంగ పూలతో
ఆకాశమంత పందిరేసి..భూదేవిలాగ వాలిపోయి 
అక్షింతలంటి తారలన్ని..ఆనాటిదాక రాకపోయి 
నీ కళ్ళలో నిషానే తీసి..కౌగిళ్ళనే హుషారే చేసి 
సంకెళ్ళతో సరాగాలాడి..కన్నీళ్లతో వసంతాలాడి 
చెల్లించుకుందాములే..చేసినా బాసలే
వేర్ ఆర్ యూనౌ..యూ ఆర్ మై లవ్
వేర్ ఆర్ యూనౌ..యూ ఆర్ మై లవ్ 
వేర్ ఆర్ యూనౌ..ఆ
ఏలా ఇంత దూరం..నీవే నాకు ప్రాణం 
ఏలా ఇంత దూరం..నీవే నాకు ప్రాణం

No comments: