సంగీతం::ఇళయరాజా
Directed::Vamshi
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::S.జానకి
తారాగణం::సుమన్,భానుప్రియ,శుభలేఖసుధాకర్,శరత్‌బాబు,J.V.సోమయాజులు,ఏడిద శ్రీరాం,మల్లికార్జునరావు,సాక్షిరంగారావు,రాళ్ళపల్లి
పల్లవి::
అ..అ..అ..అ..అ..అ..అ..అ..అ..అ
వెన్నెల్లో గోదారి అందం..నది కన్నుల్లో కన్నీటి దీపం
వెన్నెల్లో గోదారి అందం..నది కన్నుల్లో కన్నీటి దీపం
అది నిరుపేద నా గుండెలో..చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో..సాగే మౌనగీతం
వెన్నెల్లో గోదారి అందం..నది కన్నుల్లో కన్నీటి దీపం
చరణం::1
జీవిత వాహిని అలలై..జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై
బంధనమై..జీవితమే..నిన్నటి చీకటి గదిలో
ఎడబాటే..ఒక పాటై..పూలదీవిలో సుమవీణ మోగునా
వెన్నెల్లో గోదారి అందం..నది కన్నుల్లో కన్నీటి దీపం
చరణం::2
నిన్నటి శరపంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి
కన్నీరే పొంగి పొంగి..తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి..పువ్వులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే
నాకు లేదు మమకారం..మనసు మీద అధికారం
నాకు లేదు మమకారం..మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో..ఆవేదనలో రేగిన ఆలాపన సాగే
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే..మనసు వయసు కరిగే
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో..తిరిగే..సుడులై
ఎగసే ముగిసే కథనేనా..ఎగసే ముగిసే కథనేనా
Sitaara-1983
Music::Ilayaraajaa
Directed::Vamshi
Lyrics::VeetooriSundaraRaamaMoorti
Singer::S.Jaanaki
Starring::suman,Bhaanupriya,Subhalekhasudhaakar,Sarat^baabu,J.V.Somayaajulu,EdidaSriiraam,Mallikaarjuna Rao,SaakshirangaaRao,Raallapalli.
:::::::::
a..a..a..a..a..a..a..a..a..a
vennellO gOdaari andam..nadi kannullO kanneeTi deepam
vennellO gOdaari andam..nadi kannullO kanneeTi deepam
adi nirupEda naa gunDelO..chali niTToorpu suDigunDamai
naalO..saagE maunageetam
vennellO gOdaari andam..nadi kannullO kanneeTi deepam
::::1
jeevita vaahini alalai..jeevita vaahini alalai
oohaku oopiri valalai
bandhanamai..jeevitamE..ninnaTi cheekaTi gadilO
eDabaaTE..oka paaTai..pooladeevilO sumaveeNa mOgunaa
vennellO gOdaari andam..nadi kannullO kanneeTi deepam
::::2
ninnaTi Sara panjaraalu daaTina swarapanjaraana nilachi
kanneerE poMgi poMgi..terala chaaTu
naa choopulu chooDalEni manchu bommanai
yavvanaalu adimi adimi..puvvulanni chidimi chidimi
vennelanta ETipaalu chEsukunTinE
naaku lEdu mamakaaram..manasu meeda adhikaaram
naaku lEdu mamakaaram..manasu meeda adhikaaram
aaSalu maasina vEsavilO..aavEdanalO rEgina aalaapana saagE
madilO kalalE nadilO velluvalai pongaarE..manasu vayasu karigE
madhinchina saraagamE kalatanu rEpina valapula vaDilO..tirigE..suDulai
egasE mugisE kathanEnaa..egasE mugisE kathanEnaa
No comments:
Post a Comment