Monday, August 05, 2013

ప్రేమమందిరం--1981



సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు 
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్

సాకి::

ఉదయమా ఉదయమా..ఉదయించకు ఉదయించకు

పల్లవి:: 

ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో 

ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో
ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో

చరణం::1 

ఉదయమా నాకు తెలుసు వెలుగే నీ ప్రేమ అనీ
అది లోకానికి దీపమనీ 
ఉదయమా నాకు తెలుసు వెలుగే నీ ప్రేమ అనీ
అది లోకానికి దీపమనీ
కన్నీటి ప్రమిదలో..కరిగే కర్పూరమై
వంచించిన దేవతకే..హారతులే పడుతుంటే..ఏ
పేరుకామె ప్రేయసీ..ప్రేమకామె రాక్షసీ
అందుకే..అందుకే
ప్రేమకి నే కడుతున్నా నీ కడుపున సమాధి 

ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో
ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో

ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో

చరణం::2 

ఉదయమా నీకు తెలుసు ప్రేమ చచ్చిపోదనీ 
నీకు తెలుసు అది చావుకన్నా బాధ అని 
ఉదయమా నీకు తెలుసు ప్రేమ చచ్చిపోదనీ
అది చావుకన్నా బాధ అని
ప్రేమకై చచ్చేదీ..చచ్చీ ప్రేమించేదీ 
మనసిచ్చిన పాపానికి..బలిపశువై పోయేది
చరిత్రలో మగవాడే..చిరంజీవి మానవుడే
అందుకే అందుకే ప్రేమికులారా వినండి
ప్రేమంటే...ఆత్మబలీ 

ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో

ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో

No comments: