Monday, August 05, 2013

బహుదూరపు బాటసారి--1983



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1386

సంగీతం::చక్రవర్తి
రచన:: దాసరి
గానం::P.సుశీల

పల్లవి::

మేఘమా..ఆ..నీలి మేఘమా
మేఘమా..నీలి మేఘమా
ఉరమకే..మెరవకే నీలి నీలి మేఘమా
మేఘమా..నీలి మేఘమా
ఉన్న రూపం మార్చుకుని
నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై కరగకే
మేఘమా..నీలి మేఘమా

చరణం::1

ఫ్రతి ప్రసవం గండమని
ప్రతి నిముషం మరణమని
తెలిసి కూడ కన్నతల్లులు
ఫ్రతి ప్రసవం గండమని
ప్రతి నిముషం మరణమని
తెలిసి కూడ కన్నతల్లులు
మరల మరల కంటారు
పగటి కలలు కంటారు
బిడ్డ దైవం అంటారు
దైవమే రాయి అని ఉలుకు పలుకు లేనిదని 
తెలుసుకోరు పిచ్చి తల్లులు
మేఘమా..నీలి మేఘమా 
ఉరమకే..మెరవకే..నీలి నీలి మేఘమా
మేఘమా..నీలి మేఘమా

చరణం::2

సాగరమే సంసారమని
ఈదటమే కష్టమని
మరచిపోయి కన్న తండ్రులు
సాగరాన పయనిస్తారు
మునిగి తేలుతుంటారు
మునకే మిగులునని 
కన్నందుకు ఫలితమని 
తెలుసుకోరు పిచ్చి తండ్రులు
మేఘమా నీలి మేఘమా
ఉరమకే మెరవకే..నీలి నీలి మేఘమా
మేఘమా..నీలి మేఘమా
ఉన్న రూపం మార్చుకుని
నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై కరగకే
మేఘమా..నీలి మేఘమా

No comments: