సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.జానకి
తారాగణం::చిరంజీవి,భానుప్రియ,శారద,మహేష్‌బాబు
పల్లవి::
యా..య..య..యాయ
యా..య..య..య..యాయ
నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా
కాదు బిడియాలకు వేళా
లేరా సయ్యాటకు రారా
పరువాలకు పాడర జోల
నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
చరణం::1
కూకుంటే కునుకొస్తాది
కునుకొస్తే..హ..కలలొస్తాయి
తానాలు ఆడేస్తున్నా తాపం తగ్గదురా
దీపాలు పెట్టారంటే ప్రాణం నిలవదురా
మల్లెల మబ్బులు ముసిరే వేళ
ఊహకు ఉరుములు పుట్టే వేళ
చినుకంత ముద్దాడి పోరా
నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా
చరణం::2
పగటేల చలి వేస్తాది
నడిరేయి..హా..గుబులొస్తాది
పక్కంత దొర్లేస్తున్నా పరువం ఆగదురా
వొల్లంత నిమిరేస్తున్నా వలపే తీరదురా
మొటిమలు మొగ్గలు పుట్టే వేళ
బుగ్గకు ఎరుపులు పట్టె వేళ
ఎదనిండ అదిమేసుకోరా
నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన..అబ్బా..నా గుండె గిల గిలలాడిందమ్మా
కాదు బిడియాలకు వేళా
లేరా సయ్యాటకు రారా
పరువాలకు పాడర జోల
నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా
No comments:
Post a Comment