Monday, June 09, 2014

మొగుడు కావాలి--1980



సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి సుందర రామూర్తి
గానం::S.P.బాలు, P.సుశీల, S. P. శైలజ 
తారాగణం::చిరంజీవి,గాయిత్రి,సువర్ణ,నూతన్ ప్రసాద్,S. వరలక్ష్మి,రమణమూర్తి

పల్లవి::

ఓ చిలకా..పలుకే బంగారమా
అహాహ..నీ అలకే చిలిపి సింగారమా
నేల మీద ఉన్న చందమామ..ఏలనమ్మ నీకు ఇంత ధీమా
ఓ ప్రియతమా..కోపమా..తాపమా..తాపమా..తాపమా
ఓ చిలకా..పలుకే బంగారమా
ఆహాహాహ..నీ అలకే చిలిపి సింగారమా

చరణం::1

వయసులో ఎందుకీ మనసులు అందుకో సొగసులు
హో హో హో హో..హాయిగా
వయసులో ఎందుకీ మనసులు అందుకో సొగసులు
వయ్యారాలే నీదిగా..కలుసుకో..కరిగిపో
వెన్నెల వేళకు వెలిగిపో..ఆ పాత కథ మరిచిపో
కౌగిలిగింతకు కడ లేదు..ఈ చక్కిలిగింతకు తుదిలేదు
ఓ చిలకా..పలుకే బంగారమా
ఆహాహాహ..నీ అలకే చిలిపి సింగారమా

చరణం::2

వలపులో రోజుకో మలుపులు..మోజుతో పిలుపులు
హో హో హో హో..చెల్లవు
వలపులో రోజుకో మలుపులు..మోజుతో పిలుపులు
హో హో హో హో..చెల్లవు తెలుసుకో..కలుసుకో
మనసున మనసై మసులుకో..నీ పగటి కల మరిచిపో
మల్లెల మాసం మరి రాదు..అది మన కోసం రాబోదు 
ఓ చిలకా..పలుకే బంగారమా
అహాహ..నీ అలకే చిలిపి సింగారమా
నేల మీద ఉన్న చందమామ..ఏలనమ్మ నీకు ఇంత ధీమా
ఓ ప్రియతమా..కోపమా..తాపమా..తాపమా..తాపమా
ఓ చిలకా..పలుకే బంగారమా
ఆహాహాహ..నీ అలకే చిలిపి సింగారమా

No comments: