Thursday, May 22, 2014

ప్రేమ బంధం--1976




సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు,V.రామకృష్ణ. 
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,వాణిశ్రీ,సత్యనారాయణ,రావికొండలరావు,జయమాలిని,జానకి

పల్లవి::

ఎక్కడున్నాను..నేనెక్కడున్నాను 
ఎక్కడున్నాను..నేనెక్కడున్నాను
రాచనిమ్మ తోటలోనా రంభలున్న పేటలోనా
ఎక్కడున్నాను నేనెక్కడున్నాను

చరణం::1

వెండికొండ శిఖరాన వేల్పుల సముఖాన 
కొలువున్న..పరమేశుడవీవయ్యా 
నీలో నెలకొన్న జగదంబ ఈయమ్మ 
నీలో నెలకొన్న జగదంబ ఈయమ్మ
ఎప్పుడు వుండే పార్వతి వుంటే 
ఏమి కొత్తదన ముందిరా 
ఎక్కడో వున్న గంగ దక్కితే ఎంతో ఎంతో వుందిరా     
ఏడుకొండలపైన వేడుకగా వున్న 
ఏడుకొండలపైన వేడుకగా వున్న
ఆ తిరుపతి వెంకన్నకు నీవన్నా  
ఆ అలివేలు మంగమ్మ ఈయమ్మా
అలకలు పోయే మంగమ్మ వుంటే 
అచ్చట ముచ్చట ఎచ్చటరా 
నవ్వుల బొమ్మ నాంచారమ్మ
పక్కన వుంటే పండగరా
ఎక్కడున్నావు నీ వెక్కడున్నావు

చరణం::2

రాచనిమ్మ తోటలోనా రంభలున్న పేటలోనా 
ఎక్కడున్నావు నీ వెక్కడున్నావు
ఓం శాంకరీ జ్ణాన దీపాంకురీ రాజరాజేశ్వరీ 
నిఖిల లోకేశ్వరీ ఈశ్వరీ
జుత్తుకు రంగు పూసి నంతనే మత్తెక్కిపోయిందా 
సీమ దుస్తులు వేసినంతనే శివమెత్తిపోయిందా
ధర్మైక నిష్టాకరీ దుష్టశిక్షాకరీ శిష్ట రక్షాకరీ శ్రీకరీ  
పాత యింత రోతాయెనా కొత్త అంత వింతాయెనా
వయసేమో వాడిపోయినా మనసు కోడెదూడాయెనా 
పెడదారి పడితే గిరి దాటిపోతే సుడిగాలినై నిన్ను చుట్టేస్తా 
మహంకాళినై నిన్ను పట్టేస్తా చుట్టేస్తా పట్టేస్తా  
కోపమున్‌ తగ్గించి మా పాపముల్‌ మన్నించి
ఈ పాపలన్‌ కరుణించి కాపాడవమ్మా 
నమస్తే నమస్తే నమస్తే  నమ:

No comments: