సంగీతం::J.V.రాఘవులు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల
పల్లవి::
జాంబవంతా..రామదాసా..సుగ్రీవ సైనికా
ఆంజనేయ సకా..అంగజ మిత్రా..అమృత గాత్ర
గువ్వా గూడెక్కే..రాజు మేడేక్కే
గువ్వా గూడెక్కే..రాజు మేడేక్కే
గువ్వ వన్నె చూసి..వొళ్ళు తిమ్మిరేసి
గుంట నక్కకేమో..కన్నుకుట్టే
ఓ..జాంబవంతా..ఆ..వినవోయి వింత
ఓ..జాంబవంతా..ఆ..వినవోయి వింత
గువ్వా గూడెక్కే..రాజు మేడేక్కే
గువ్వా గూడెక్కే..రాజు మేడేక్కే
చరణం::1
అందాల ఆ గువ్వ..అలా అలా అలా..కొమ్మపై వాలింది
మురిపాల ఆ మువ్వ..గలా గలా గలా..ముద్దుగా పలికింది
అందాల ఆ గువ్వ..అలా అలా అలా..కొమ్మపై వాలింది
మురిపాల ఆ మువ్వ గలా గలా గలా..ముద్దుగా పలికింది
పలుకులను విని తలపులను గని..ఆ గుంట నక్క
పాములాగా బుస్సుమన్నది..గువ్వా తుస్సుమన్నది..చొచొచొ
ఓ..జాంబవంతా..ఆ..వినవోయి..వింత
ఓ..జాంబవంతా..ఆ..వినవోయి..వింత
గువ్వా గూడెక్కే..రాజు మేడేక్కే
గువ్వా గూడెక్కే..రాజు మేడేక్కే
చరణం::2
విధిలేక గువ్వపాటం..అదే అదే అదే..బాధతో కుమిలింది
మనసైన జంట కోసం..పదే పదే పదే..దిక్కులే చూసింది
విధిలేక గువ్వపాటం..అదే అదే అదే..బాధతో కుమిలింది
మనసైన జంట కోసం..పదే పదే పదే..దిక్కులే చూసింది
పొద్దంత దారికాచి పొదల మాటు వేసి..ఆ గుంట నక్క
ఎగిరి ఎగిరి..తుర్రుమన్నది గువ్వ..గుయ్యుమన్నది
ఓ..జాంబవంతా..ఆ..వినవోయి వింత
ఓ..జాంబవంతా..ఆ..వినవోయి వింత
గువ్వా గూడెక్కే..రాజు మేడేక్కే
గువ్వా గూడెక్కే..రాజు మేడేక్కే
చరణం::3
ఆ గువ్వ ఎవరో కాదు..నేనే..నేనే
ఆ జంట ఎవరో కాదు..నా ప్రియుడే..నా ప్రియుడే
ఆ గుంట నక్క ఎవడు..సంజీవరాయుడు
ఆ గుంట నక్క ఎవడు..సంజీవరాయుడు
జట్టు గూడి సాగి పోదాం..వాడి జిత్తులన్నీ చిత్తు చేద్దాం
జట్టు గూడి సాగి పోదాం..వాడి జిత్తులన్నీ చిత్తు చేద్దాం
No comments:
Post a Comment