Monday, May 17, 2010

రాముని మించిన రాముడు--1975


సంగీతం::సూరవరాజు
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య,వాణిశ్రీ,శ్రీవిద్య,S.వరలక్ష్మి

పల్లవి::

ఇదేనా మన నీతి ఇదేనా మన ఖ్యాతి 
ఇదేనా ఇదేనా ఇదేనా..ఆఆఆ  
మనసభ్యత మన సంస్కృతి నేటికిలా మారిందా
వెర్రితలలు వేసిందా ఇంతకు దిగజారిందా..ఇదేనా ఇదేనా 

చరణం::1

అర్ధనగ్నముగ ఆటలాడితే అదే 
నాట్యమనుకున్నారా అదే నాట్యమనుకున్నారా
అర్ధనగ్నముగ ఆటలాడితే అదే 
నాట్యమనుకున్నారా అదే నాట్యమనుకున్నారా
సా౦ప్రదాయ నృత్యముచేస్తే..ఏఏఏఏఏఏఏఏ  
సా౦ప్రదాయ నృత్యముచేస్తే నలుగురు కలసీ నవ్వేరా
నవ్వేరా నవ్వేరా..ఆఆఆ  
ఇదేనా మన నీతి ఇదేనా మన ఖ్యాతి 
ఇదేనా ఇదేనా ఇదేనా..ఆఆఆ 
మనసభ్యత మన సంస్కృతి నేటికిలా మారిందా
వెర్రితలలు వేసిందా ఇంతకు దిగజారిందా..ఇదేనా ఇదేనా 

చరణం::2

గాన కళకు కళ్యాణ మంటపం..ఆఆఆఆ  
నాట్యకళకు శృంగారమందిరం..మ్మ్
గాన కళకు కళ్యాణ మంటపం 
నాట్యకళకు శృంగారమందిరం
మన దేశమునే మరిచారా..ఆఆఆ  
పరుల తళుక్కులకు మురిసేరా..ఆ
మురిసేరా..ఆఆఆఆఆ..మురిసేరా..ఆఆ    
ఇదేనా మన నీతి ఇదేనా మన ఖ్యాతి 
ఇదేనా ఇదేనా ఇదేనా..ఆఆఆ 
మనసభ్యత మన సంస్కృతి నేటికిలా మారిందా
వెర్రితలలు వేసిందా ఇంతకు దిగజారిందా..ఇదేనా ఇదేనా   

No comments: