Sunday, May 03, 2015

నిర్దోషి--1967



సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::N.T.రామారావు, సావిత్రి, అంజలీదేవి,మిక్కిలినేని, సత్యనారాయణ

పల్లవి::

ఈ పాట నీ కోసమే..హోయ్
ఈ ఆట నీ కోసమే
ఈ పాట నీ కోసమే..హోయ్
ఈ ఆట నీ కోసమే
ఈ పూలు పూచేది ఈ గాలి వీచేది
మనసైన మన కొసమే
ఓయి ఈ పాట నీ కోసమే..హోయ్
ఈ ఆట నీ కోసమే

చరణం::1

పగలయిన రేయైన నీ ధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
అహహ ఒహొహొ ఓహొహో..ఓఓ
పగలయిన రేయైన నీ ధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
నీ చూపు నా పాలి సుమబాణమే
నీ చూపు నా పాలి సుమబాణమే
నిను చూడ కదలాడు నా ప్రాణమే
ఈ పాట నీకోసమే..హోయ్
ఈ ఆట నీ కోసమే

చరణం::2

నీ గుండెలో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
అహహ ఒహొహొ ఓహొహో..ఓఓ
నీ గుండెలో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
నీ కళ్ళ వెనకాల నేనుంటిని 
నీ కళ్ళ వెనకాల నేనుంటిని
కనరాని వలయాలు కనుగొంటిని
ఈ పాట నీ కోసమే హోయ్
ఈ ఆట నీ కోసమే
ఈ పూలు పూచేది ఈ గాలి వీచేది
మనసైన మన కొసమే
ఓయి ఈ పాట నీ కోసమే..హోయ్
ఈ ఆట నీ కోసమే

No comments: