Thursday, April 30, 2015

ఇది కథ కాదు--1979




సంగీతం::M.S.విశ్వనాధన్
రచన::ఆత్రేయ
గానం::బాలసుబ్రమణ్యం,రమోల,సదన్

Film Directed By::K.Baalachandar

తారాగణం::కమల్‌హాసన్,చిరంజీవి,శరత్‌బాబు,జయసుధ,లీలావతి.

పల్లవి::

జూనియర్ జూనియర్ జూనియర్
Yes boss
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు

చరణం::1

అటు ఇటు తానొక ఆటబొమ్మని
తెలిసే ఎందుకు వలచేవు
అటు ఇటు తానొక ఆటబొమ్మని
తెలిసే ఎందుకు వలచేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచవు
గడ్డిపోచా? నేనా? హి హి
ఒడ్డున పెరిగే గడ్డిపోచవు
ఒద్దిక నదితో కోరేవు

ఒడ్డున పెరిగే గడ్డిపోచకు
హృదయం ఎందుకు ఉండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదు
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు
ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు

చరణం::2

సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా హి హి హి
ఉం హ హ హ
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
తీగకు పందిరి కావలెగానీ
తెలుసా నువ్వే పందిరని
తీగకు పందిరి కావలెగానీ
తెలుసా నువ్వే పందిరని

నీటిని చూసి దాహము వేస్తే
తేనె కోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం
No, it’s bad
But I am mad
మోడు కూడా చిగురించాలని
మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
వాట్ పక పక పిక పిక

జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు

చరణం::3

చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
Boss love has no season not even reason
Shut up
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి
ఎదురుతెన్నులు కాచేవు
ఉదయంకోసం పడమర తిరిగి
ఎదురుతెన్నులు కాచేవు

ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
It is highly idiotic
No boss it is fully romantic
హ హ హ హ హ
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున ఉన్నది చెప్పి నవ్వమ్మా
హ హ హ హ
మనసున ఉన్నది చెప్పి నవ్వమ్మా

ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు

No comments: