సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::వీటూరి
గానం::P.సుశీల
Film Directed By::K.Baalachandar
తారాగణం::కమల్‌హాసన్,చిరంజీవి,శరత్‌బాబు,జయసుధ,లీలావతి.
పల్లవి::
జోలపాట పాడి ఊయలూపనా
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా
నా జాలి కథను చెప్పి మేలు కొలపనా
జోలపాట పాడి ఊయలూపనా
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా
నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా
పెళ్ళాడిన ఆ మగడు..ప్రేమించిన ఈ ప్రియుడు
పెళ్ళాడిన ఆ మగడు..ప్రేమించిన ఈ ప్రియుడు
వెళ్ళారు నన్ను విడచి..వచ్చావు నువ్వు ఒడికి
వచ్చావు నువ్వు ఒడికి
జోలపాట పాడి ఊయలూపనా
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా
నా జాలి కథను చెప్పి మేలు కొలపనా
చరణం::1
చేసుకున్న బాసలన్ని చెరిగిపోయెను
నే రాసుకున్న విన్నపాలు చేరవాయెను
చేసుకున్న బాసలన్ని చెరిగిపోయెను
నే రాసుకున్న విన్నపాలు చేరవాయెను
ఆకసాన చీకటులే ఆవరించెనూ
ఆశలన్ని విడిచి ఉన్న నేడు వెన్నెలొచ్చెను
జోలపాట పాడి ఊయలూపనా
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా
నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా
చరణం::2
మీరా మనసారా నాడు వలచెను గోపాలుని
కోరిక నెర వేరక చేపట్టెను భూపాలుని
మీరా మనసారా నాడువలచెను గోపాలుని
కోరిక నెర వేరక చేపట్టెను భూపాలుని
ఆ కథకు నా కథకు అదే పోలికా
ఆ మీదట ఏమయినది చెప్పలేనికా
జోలపాట పాడి ఊయలూపనా
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా
నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా
చరణం::3
నల్లనయ్య నాడూదెను పిల్లనగ్రోవీ
ఆమె పరవశించి పోయినదా గానము గ్రోలీ
నల్లనయ్య నాడూదెను పిల్లనగ్రోవీ
ఆమె పరవశించి పోయినదా గానము గ్రోలీ
మరువరాని ఆ మురళి మరల మ్రోగెనూ
ఆ మధుర గానమునకు బాబు నిదురపోయెనూ
No comments:
Post a Comment