Tuesday, April 01, 2014

అన్నదమ్ముల అనుబంధం--1975

సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి 
గానం::S.P.బాలు,P.సుశీల    
తారాగణం::N.T.రామారావు,మురళిమోహన్,బాలకృష్ణ,జయమాలిని,కుమారి లత,కాంచన 

పల్లవి::

ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను 
ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను 
I LOVE YOU..సోనీ..సోనీ..I LOVE YOU..సోనీ..సోనీ

చరణం::1

అందాల నీమోము నా కోసమే నిండైన నా ప్రేమ నీ కోసమే
అందాల నీమోము నా కోసమే నిండైన నా ప్రేమ నీ కోసమే
నా మీద ఈనాడు అలకేలనే నేరాలు మన్నించి రావేలనే
I LOVE YOU..సోనీ..సోనీ..I LOVE YOU..సోనీ..సోనీ

చరణం::2

వలచింది గెలిచింది నీవేనులే నీ ముందు ఓడింది నేనేనులే
వలచింది గెలిచింది నీవేనులే నీ ముందు ఓడింది నేనేనులే
కోపాలు తాపాలు మనకేలలే ఇక నైన జత జేరి గడపాలిలే
I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..రాజా..రాజా
   
చరణం::3
                
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే అనురాగమధువెంతో కురిసిందిలే
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే అనురాగమధువెంతో కురిసిందిలే
అధరాలు ఏమేమొ వెతికేనులే హృదయాలు పెనవేసి ఊగేనులే..లలలా        
I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..సోనీ..సోనీ
ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను 
I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..సోనీ..సోనీ
తారాగణం:ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం 

No comments: