సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::P.సుశీల
తారాగణం::గుమ్మడి,చంద్రమోహన్,S.V.రంగారావు,సావిత్రి,ప్రమీల,రమాప్రభ,జయసుధ
పల్లవి::
అల్లుడి గుట్టు చెప్పనా..యింటల్లుడి గుట్టు చెప్పనా

నలుగురు చూచి నవ్వేలాగా..అల్లరిపాలు చెయ్యనా

చరణం::1
అమాయకుడిలా ఉన్నాడు..దొంగ నాటకా లాడాడూ
అమాయకుడిలా ఉన్నాడు..దొంగ నాటకా లాడాడూ
దొండపండు లాంటమ్మాయిని..కాకిలాగ కాజేశాడూ
అల్లుడి గుట్టు చెప్పనా..యింటల్లుడి గుట్టు చెప్పనా
చరణం::2
చదివిందేమో వేదమటా..మనసులో ఉంది భూతమటా
చదివిందేమో వేదమటా..మనసులో ఉంది భూతమటా
ముసిముసి నవ్వులు..వేషమమ్మా
ఉన్నది చెబితే రోషమమ్మా..రోషమమ్మా
అల్లుడి గుట్టు చెప్పనా..యింటల్లుడి గుట్టు చెప్పనా
చరణం::3
కోటిమందిలో యితడొకడూ..తెరచాటన అబ్బో రశికుడూ

లోకానికి శ్రీరాముడూ..లోతుజూడ శ్రీకృష్ణుడూ
అల్లుడి గుట్టు చెప్పనా..యింటల్లుడి గుట్టు చెప్పనా
నలుగురు చూచి నవ్వేలాగా..అల్లరిపాలు చెయ్యనా
అల్లుడి గుట్టు చెప్పనా..యింటల్లుడి గుట్టు చెప్పనా
No comments:
Post a Comment