Thursday, March 17, 2011

రాముడే దేవుడు--1973

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4521
సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ 
గానం::S.జానకి,P.సుశీల
తారాగణం::చలం,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మీ  

పల్లవి::

పాటకు రాగాలు..కోటి
కాని పల్లవి..ఒకటే ఒకటీ
మనిషికి భావాలు..కోటి
కాని మనసు..ఒకటే ఒకటీ   
పాటకు రాగాలు..కోటి
కాని పల్లవి..ఒకటే ఒకటీ
మనిషికి భావాలు..కోటి
కాని మనసు..ఒకటే ఒకటీ  

చరణం::1

మనసుకు మనసూ తోడుంటేనే
జీవితానికి...నిండుదనం
కోరిన మనసు..కనుమరుగైతే
లేనేలేదూ జీవితం..లేనేలేదూ జీవితం     
పాటకు రాగాలు...కోటి
కాని పల్లవి...ఒకటే ఒకటీ

చరణం::2

అందని పొందే..అందమైనదా
అందేదానికి...విలువేలేదా ?
నింగిని వున్నా..దిగిరాకున్నా
కలువకు రాజు...నెలరాజే  
కలువలు వేరు..మగువలు వేరూ
మనుగడ అంటే..కథ కాదూ   
పాటకు రాగాలు...కోటి
కాని పల్లవి...ఒకటే ఒకటీ
మనిషికి భావాలు...కోటి
కాని మనసు...ఒకటే ఒకటీ
పాటకు రాగాలు..కోటి

చరణం::3

తరచేకొలదీ...పెరిగే పెన్నిధి
మమతల వెల్లువ...ప్రేమంటే
ప్రేమకు అర్థం...స్వార్థం కాదు
త్యాగమే జీవిత...పరమార్థం
త్యాగమే జీవిత...పరమార్థం  
పాటకు రాగాలు...కోటి
కాని పల్లవి...ఒకటే ఒకటీ
మనిషికి భావాలు...కోటి
కాని మనసు...ఒకటే ఒకటీ
పాటకు రాగాలు...కోటి

No comments: