సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::S.జానకి
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత,పద్మనాభం
పల్లవి::
కలగంటి కలగంటినే..ఓ చెలియ
ఓ..మగువ..ఓ..లలనా
కలగాని కలగంటినే..కలగంటి కలగంటినే
కలలోని చోద్యములు..ఏమని తెలుపుదునే
కలలోని చోద్యములు..ఏమని తెలుపుదునే
తెలుపబొయ్ సిగ్గాయనే..ఓ చెలియ
ఓ..మగువ..ఓ..లలనా
తలపామై పులకించెనే..కలగంటి కలగంటినే
చరణం::1
అందాలా శ్రీకృష్ణుడు..విందుగా నను చేరీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందాలా శ్రీకృష్ణుడు విందుగా నను చేరీ
సుందరీ లేలెమ్మనీ..ఆ అయ్యో అంతపనే
సుందరీ లేలెమ్మనీ..సందిట..సందిట పొదివినటుల
కలగంటి కలగంటినే..ఓ చెలియ..ఓ మగువ..ఓ లలనా..ఆ
కలగాని కలగంటినే..ఏఏఏఏఏ..కలగంటి కలగంటినే
చరణం::2
మున్నెరుగని సుఖలీలలా చెక్కిలి..ఊహూ సరి సరి
చెక్కిలి నొక్కుచూ చిన్నారీ..ఈ..చిన్నారీ పోపొమ్మని
చిరుముద్రలు అబ్బ..అయ్యో..చిరుముద్రలు వేసినటుల
కలగంటి కలగంటినే....ఏఏఏఏ..
చరణం::3
గోముగ నను చూసి..మోము మోమున చేర్చి
గోముగ నను చూసి..మోము మోమున చేర్చి
భామరో..ఓఓఓ..ఆఆఆ..భామరో రా రమ్మని
ఏమేమో..హవ్వ..ఏమేమో చేసినటుల
కలగంటి కలగంటినే..ఓ చెలియ..ఓ మగువ..ఓ లలనా
కలగాని కలగంటినే..ఏఏఏఏఏఏ..కలగంటి కలగంటినే..ఏఏఏఏ
No comments:
Post a Comment