సంగీతం::G.K.వెంకటేష్
రచన::కోదండపాణి
గానం::S.జానకి
తారాగణం::శారద,రంగానాద్,రాజబాబు,గుమ్మడి,అల్లు రామలింగయ్య,మమత,గిరిబాబు,కృష్ణకుమారి,మమత.
పల్లవి::
అబ్బ నా పాడు బతుకు
ఎవరితోటి సెప్పుకొందునే
నేనెవరితోటి సెప్పుకొందునే
అబ్బ నా పాడు బతుకు
ఎవరితోటి సెప్పుకొందునే
నేనెవరితోటి సెప్పుకొందునే
చరణం::1
బాడీలు తొడగనీడు..బావికాడకెల్లనీడు
బాడీలు తొడగనీడు..బావికాడకెల్లనీడు
సిలుకు సీర కట్టనీడు..సినిమాకి ఎల్లనీడు
పాడు బెమ్మ ఏమి రాసెనే..అయ్యో
అన్నాయం...రాత రాసెనే
ఓ రంగీ ఓ మంగీ..ఎన్నాళ్ళు ఓర్సుకొందునే
నేనెన్నాళ్ళు...ఓర్సుకొందునే
చరణం::2
సుక్క బొట్టు పెట్టనీడు..సుట్టాల చూడనీడు
సుక్క బొట్టు పెట్టనీడు..సుట్టాల చూడనీడు
సుట్టుపక్కా ఎళ్ళనీడు..సున్నానికి పోనీడు
పాడు బెమ్మ ఏమి రాసెనే..అయ్యో
అన్నాయం...రాత రాసెనే
ఓ రంగీ ఓ మంగీ..ఎన్నాళ్ళు ఓర్సుకొందునే
నేనెన్నాళ్ళు...ఓర్సుకొందునే
అవ్వ నా పాడు బతుకు..ఎవరితోటి సేప్పుకొందునే
నేనెవరితోటి సెప్పుకొందునే...ఒలమ్మీ
చరణం::3
అద్దంలో సూడనీడు..మిద్దిమీదకెళ్ళనీడు
అద్దంలో సూడనీడు..మిద్దిమీదకెళ్ళనీడు
పూలేమో పెట్టనీడు..కొప్పైనా దువ్వనీడు
పాడు బెమ్మ ఏమి రాసెనే....అయ్యో
అన్యాయం...రాత రాసెనే
ఓ రంగీ ఓ మంగీ..ఎన్నాళ్ళు ఓర్సుకొందునే
నే నెన్నాళ్ళు..ఓర్సుకొందునేa
No comments:
Post a Comment