Thursday, March 10, 2011

పవిత్ర బంధం--1971













సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర 
గానం::P.సుశీల  
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య.

పల్లవి::

పచ్చబొట్టు చెరిగిపోదులే..నా రాజా 
పడుచుజంట చెదరిపోదులే..నా రాజా
పచ్చబొట్టు చెరిగిపోదులే..నా రాజా 
పడుచుజంట చెదరిపోదులే..నా రాజా 
పచ్చబొట్టు చెరిగిపోదులే..

చరణం::1

పండినచేలు పసుపుపచ్చ..పండినచేలు పసుపుపచ్చ 
నా నిండు మమతలు..మెండు సొగసులు లేతపచ్చ..ఆ
మెడలో పతకం చిలకపచ్చ..మన మేలిమి గురుతీ వలపులపచ్చ 
పచ్చబొట్టు...చెరిగిపోదులే..ఏ

చరణం::2

నూరేళ్ళ వెలుగు నుదుటిబొట్టు..నూరేళ్ళ వెలుగు నుదుటిబొట్టు 
ఇది నోచిన నోములు..పూచినరోజున పెళ్లిబొట్టు..ఊ
కట్టేను నీ చేయి తాళిబొట్టు..అది కలకాల కాంతుల కలిమిచెట్టు
పచ్చబొట్టు చెరిగిపోదులే..నా రాజా పడుచుజంట చెదరిపోదులే 
నా రాజా...పచ్చబొట్టు..చెరిగిపోదులే..ఏ

No comments: