Saturday, October 04, 2014

దత్తపుత్రుడు--1972



సంగీతం::T.చలపతిరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,కైకాల సత్యనారాయణ,అల్లురామలింగయ్య,వెన్నిరాడైనిర్మల,రమాప్రభ,సూర్యకాంతం. 

పల్లవి::

గౌరమ్మ తల్లికి బోనాలు..దుర్గమ్మ తల్లికి జేజేలు
ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ
గౌరమ్మ తల్లికి బోనాలు..దుర్గమ్మ తల్లికి జేజేలు

చరణం::1

అన్నం పెట్టే రైతుకే సున్నం రాసే పెద్దలు
గౌరమ్మ తల్లీ...ఇనుకో
నోటికి అందే...ముద్దనే 
తన్నుకుపోయే గద్దలు..ఆ ఆ ఆ ఆ
రోజు రోజుకు ముదురుతువుంటే
ఊళ్ళకు ఊళ్ళే ముంచుతు వుంటే
ఎరుగనట్టు చూస్తున్నావా..ఏమమ్మా తల్లీ             
గౌరమ్మ తల్లికి...బోనాలు
దుర్గమ్మ తల్లికి జేజేలు..ఆ ఆ ఆ ఆ

చరణం::2

చావు దెబ్బలు...తింటున్నా
పొగరు తగ్గని పొట్టేళ్ళు..ఇనుకోమ్మా ఇనుకో
దమ్మిడీకీ...కొరగాకున్నా
డాబులు చూసే సోగ్గాళ్ళు..ఆ ఆ ఆ ఆ
తిమ్మిరెక్కి తెగ తిరుగుతు వుంటే
తిమ్మిరెక్కి తెగ తిరుగుతు వుంటే 
ఎరగనట్టు చూస్తున్నావా ఏమమ్మా తల్లీ 
గౌరమ్మ తల్లికి బోనాలు
దుర్గమ్మ తల్లికి జేజేలు..ఆ ఆ ఆ ఆ

చరణం::3

పైరు పచ్చగా వుంటే
మా వూరు చల్లగా వుంటే  
పైరు పచ్చగా వుంటే
మా వూరు చల్లగా వుంటే 
బావ తోడుగా వుంటే
మా మరదలు నీడగ వుంటే..ఆ ఆ ఆ ఆ
ఆపై నీదయ మాపై వుంటే
రేపో మాపో మా పెళ్ళైతే
వచ్చే ఏటికి పాపనెత్తుకొని..వస్తాము తల్లీ   
గౌరమ్మ తల్లికి బోనాలు
దుర్గమ్మ తల్లికి జేజేలు..ఆ ఆ ఆ ఆ

No comments: