Tuesday, July 22, 2014

చిరంజీవులు--1956

















సంగీతం::ఘంటసాల
రచన::మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు, జమున, గుమ్మడి, C.S.R. ఆంజనేయులు, బాలసరస్వతి,
మాష్టర్ బాబ్జి, బేబి శశికళ

పల్లవి::

మనసు నీదే మమత నాదే
నా దానవే నే నీవాడనే 

మనసు నీదే మమత నాదే
నా దానవే నే నీవాడనే 

చరణం::1

చివురు మామిడి పందిళ్లనీడా
నిలిచింది చిలక నా కోసమే
చివురు మామిడి పందిళ్లనీడా
నిలిచింది చిలక నా కోసమే
చివురింటి చిన్నదానా
నా దానవే నే నీవాడనే

మనసు నీదే మమత నాదే
నా దానవే నే నీవాడనే 

చరణం::2

కనుల కాటుక కళ్యాణ తిలకం
నగుమోము కలకల నా కోసమే
కనుల కాటుక కళ్యాణ తిలకం
నగుమోము కలకల నా కోసమే
చిరునవ్వు చిన్నదాన
నా దానవే నే నీవాడన

మనసు నీదే మమత నాదే
నా దానవే నే నీవాడనే 

చరణం ::3

పువ్వులు జల్లి పన్నీరు జల్లి దీవించి
మీ వారు పంపేరులే పువ్వులు జల్ల్లి పన్నీరు జల్లి
దీవించి మీ వారు పంపేరులే
మనసైన చిన్నదానా మీ ఇంటికి మా ఇంటికీ

మనసు నీదే మమత నాదే
నా దానవే నే నీవాడనే

No comments: