Wednesday, December 08, 2010

ముగ్గురు అమ్మాయిలు--1975



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరి,L.R.అంజలి,శరావతి
తారాగణం::చంద్రకళ,భారతి,ప్రమీల,జయసుధ, చంద్రమోహన్,రేలంగి,రమణారెడ్డి,రాజబాబు

పల్లవి::

చిట్టిబాబూ స్వాగతం..చేరిందీ ఉత్తరం 
ముస్తాబై వచ్చాము..ముగ్గురమ్మాయిలం 
ముద్దు..ముద్దు..గుమ్మలం 
చిట్టిబాబూ స్వాగతం..చేరిందీ ఉత్తరం 
ఐ యం....శోభారాణి
ఐ యాం....రోజారాణి
ఐ యాం....ఝాన్సీ రాణి 
ఏ రాణి కావాలో..కోరుకో కోరుకో 
చిట్టిబాబూ స్వాగతం..చేరిందీ ఉత్తరం 

చరణం::1

ఎత్తూ అయిదడుగుల..ఆరంగుళాలూ
చెస్టూ సుమారు..ముప్పయ్యారంగుళాలూ 
ఎత్తూ అయిదడుగుల..ఆరంగుళాలూ
చెస్టూ సుమారు..ముప్పయ్యారంగుళాలూ 
నడుం కొలత పదహారు..మేనిరంగు బంగారు
నడుం కొలత పదహారు..మేనిరంగు బంగారు
అడగకుండా తెలుసుకో..మిగతా అందాలు
చిట్టిబాబూ స్వాగతం...చేరిందీ ఉత్తరం 

చరణం::2

చిట్టిబాబుగారెందుకో..సిగ్గులొలుకుతూ ఉన్నారు 
చిట్టిబాబుగారెందుకో..సిగ్గులొలుకుతూ ఉన్నారు
చెప్పాలనుకున్నదేదో..అసలే చెప్పలేకున్నారు 
ఏమిటయ్య నీ బాధ..చెప్పవయ్య శ్రీనాధా 
ఏమిటయ్య నీ బాధ..చెప్పవయ్య శ్రీనాధా 
ఒకరొక్కరె కావాలా..ముగ్గురమొక్కటై రావాలా 
చిట్టిబాబూ స్వాగతం...చేరిందీ ఉత్తరం 

చరణం::3

తమకు సన్మానం చేయాలని..ఎంతో అనుకున్నాం 
తగిన లగ్నమిపుడు కుదిరిందని..ఎంతో పొంగిపోతున్నాం
ఇదే కాశ్మీరుపన్నీరూ..ఇదే గొల్కొండ అత్తరూ 
ఇక ఈ దండను చూశారా..ఆఆఆఆ..ఈ దండను చూశారా 
దీన్ని పైనుండే..బామ్మగారు..ప్రత్యేకం పంపారూ  
చిట్టిబాబూ స్వాగతం..చేరిందీ ఉత్తరం 

No comments: