Wednesday, December 08, 2010

వాడే వీడు--1973













సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,రమోల 
తారాగణం::N.T.రామారావు,మంజుల,నాగభూషణం,పద్మనాభం, పండరీబాయి
పల్లవి::

చీరలేని చిన్నదానా
ఓయబ్బ చిగురాకు వన్నెదానా
చిక్కావే నా చేతికి అమ్మదొంగ
ఎట్టా నిన్నొదిలేది సామిరంగా
చీరలేని చిన్నదానా...ఓయబ్బ
చిగురాకు...వన్నెదానా
చిగురాకు వన్నెదానా..ఏహే ఓహో

చరణం::1

మంచెకాడ నాటిరాతిరి వంచనచేశావే
మరిచావా...వంచనచేశావే
పోతూ పోతూ నా గుండెల్లో దూసుకుపోయావే
కిల్లాడి...దూసుకుపోయావే
ఈపూట నీపైట నాచేత చిక్కింది
ఈపూట నీపైట నాచేత చిక్కింది
ఎదురుదెబ్బ తిన్నావే ఎక్కడికెళతావే
చీరలేని చిన్నదానా..ఓ..యబ్బ
చిగురాకు వన్నెదానా చిగురాకు వన్నెదానా

చరణం::2

ఉబికే వయసూ ఉసిగొల్పుతుంటే ఊరుకోగలనా
ఆహా దాచిన సొగసూ దాదా అంటుంటే తట్టుకో గలనా
నిలువెల్లా నీవొంపులు గిలిగింతలు పెడుతుంటే ఆ పెడుతుంటే
నిలువెల్లా నీవొంపులు గిలిగింతలు పెడుతుంటే
ఓపలేకున్నాను...ఓ..పిల్లా...ఏయ్
చీరలేని చిన్నదానా..ఓ..యబ్బ చిగురాకు
వన్నెదానా చిగురాకు...వన్నెదానా

చరణం::3

కులుకు నడక కోడెనాగు మెలిక లాగుంది
మెలిక లాగుంది..ఏహేహే..మెలిక లాగుంది
కలికి నడుము కొండవాగు మలుపులాగుంది
ఓహోహో...మలుపులాగుంది
నీ చూపులో ఎదో చురుకుంది మెరుపుందీ..మ్మ్
నీ చూపులో ఎదో చురుకుంది మెరుపుందీ
తడిసిన నీ అందంలో లేనిది ఏముంది..ఆహా
చీరలేని చిన్నదానా..ఓయబ్బ చిగురాకు వన్నెదానా
చిక్కావే నా చేతికి అమ్మదొంగ ఎట్టా నిన్నొదిలేది
సామిరంగా...చీరలేని చిన్నదానా 

No comments: