సంగీత::T.చలపతిరావ్
రచన::దాశరథి
గానం::ఘంటసాల,T.R.జయదేవ్,శరావతి.
తారాగణం::అక్కినేని, కాంచన,పద్మనాభం,రామకృష్ణ, అంజలీదేవి,గీతాంజలి,సత్యనారాయణ
పల్లవి::
అమ్మా అమ్మా..చల్లని మా అమ్మా
ఓ త్యాగమయీ అనురాగమయీ..మా అమ్మా
అమ్మా అమ్మా చల్లని..మా అమ్మా..అమ్మా
చరణం::1
కన్న తల్లినే ఎరుగములే..మే మెరుగములె
మము పెంచిన తల్లివి...నీవేలే
అమ్మను మించిన అమ్మవులే మా అమ్మవులే
ఆ దేవుని మించిన...దేవతవే
అమ్మను మించిన అమ్మవులే మా అమ్మవులే
ఆ దేవుని మించిన...దేవతవే
ఓ త్యాగమయి అనురాగమయీ..మా అమ్మా
అమ్మా అమ్మా చల్లని మా అమ్మా..అమ్మా
చరణం::2
ఎవరో దేవుడు ఎందుకులే..మా కెందుకులే
మా పాలిట దైవము...నీవేలే
మమతలు పొంగే...హృదయములో
నీ హృదయములో..మా స్వర్గాలన్నీ ఉన్నవిలే
మమతలు పొంగే...హృదయములో
నీ హృదయములో..మా స్వర్గాలన్నీ ఉన్నవిలే
ఓ త్యాగమయీ అనురాగమయి..మా అమ్మా
అమ్మా అమ్మా..చల్లని మా అమ్మా
ఓ త్యాగమయీ అనురాగమయీ..మా అమ్మా
అమ్మా...అమ్మా..ఆఆఅ
No comments:
Post a Comment