సంగీత::T.చలపతిరావ్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,వెన్నీరాడై నిర్మల,రమాప్రభ.
పల్లవి::
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
మళ్ళీ మళ్ళీ పేలితే..చెవులు ఫిండి చేతికిస్తా
పిల్లోడోయ్ జాగర్త..ఒళ్ళుపొగరా జాగర్త
పిల్లంటె పిల్లకాదు..పిడుగురోయ్
జాగర్త..జాగర్త..జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
చరణం::1
ఆడదిలే అని వొదిలేస్తుంటే..అడ్డు తగులుతున్నావా
నా దెబ్బ చూపమంటావా
ఆడదిలే అని వొదిలేస్తుంటే..అడ్డు తగులుతున్నావా
నా దెబ్బ చూపమంటావా
పాపం పోనీ పసివాడంటే..పైకి పైకి వస్తావా
ఒక పట్టు పట్టమంటావా
నాగట్టు కెందుకొచ్చావ్..నిన్ను చూసి పోదామని
అంత బాగున్నానా..అయ్యో చెప్పాలా
హనుమంతుడి...తమ్ముడు
అడ్డం దిడ్డం మటలంటే..హద్దుసద్దు మీరుతుంటే
గడ్డి మొపులా నిన్నే..కట్టేస్తా..మోసేస్తా
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
మళ్ళీ మళ్ళీ పేలితే..చెవులు ఫిండి చేతికిస్తా
పిల్లోడోయ్ జాగర్త..ఒళ్ళుపొగరా జాగర్త
పిల్లంటె పిల్లకాదు...పిడుగురోయ్
జాగర్త..జాగర్త..జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
చరణం::2
కొమ్ములు మొలిచిన కోడెగిత్తలా..కాలుదువ్వుతున్నావా
ముకుతాడు...వెయ్యమన్నావా
కొమ్ములు మొలిచిన కోడెగిత్తలా..కాలుదువ్వుతున్నావా
ముకుతాడు..వెయ్యమన్నావా
కూతకొచ్చిన కోడిపెట్టలా..ఎగిరి కేరుతున్నావే
ఏ పుంజుకోస...మున్నావే
నువు పుంజువ అయితే..మరి నేను పెట్టనేంటి
అబ్బో పెద్ద మొగాడివి..అప్పుడే ఏం చూశావ్
ఇక ముందు...చూడు
సూటిపోటి మాటలంటె..గోటుగాడవనుకుంటే
మేకపిల్లలా నిన్నే పట్టేస్తా..ఎత్తేస్తా
పిల్లోడోయ్ జాగర్త..ఒళ్ళుపొగరా..జాగర్త
పిల్లంటె పిల్లకాదు..పిడుగురోయ్
జాగర్త..జాగర్త..జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
మళ్ళీ మళ్ళీ పేలితే..చెవులు ఫిండి చేతికిస్తా
పిల్లోడోయ్ జాగర్త..పిల్లోయ్ జాగర్త
పిల్లోడోయ్ జాగర్త..పిల్లోయ్ జాగర్త
No comments:
Post a Comment