Monday, November 03, 2014

వేట--1986





















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::K.J.ఏసుదాస్  

పల్లవి::

ఓ లేడి కూన..ఈ వేటలోన 
అలిసేవు..పరుగులోన
ఓ లేడి కూన..ఈ వేటలోన 
అలిసేవు..పరుగులోన
ఎవరూ..తోడు రారు
నడిరేయే..నీకు తోడు
విధి నిను తరిమిన..ఈ ఆట వేట

చరణం::1

పసుపు కుంకుమలు ఒకవైపు
ప్రేమ సంకెలలు ఒకవైపు
పసుపు కుంకుమలు ఒకవైపు
ప్రేమ సంకెలలు ఒకవైపు
జరిగే ఈ సంకుల సమరంలో
కన్నీరే మిగిలేను బ్రతుకంతా ఇక రగిలేను
ఏ రక్కసి..వికృత హాసమిది
ఏ కర్కశ..ముష్కర హస్తమిది
ఇది కత్తుల..బోనమ్మా
ఇది నెత్తుటి..వానమ్మా

ఓ లేడి కూన..ఈ వేటలోన 
అలిసేవు..పరుగులోన

చరణం::2

నమ్మిన నెచ్చెలి కోసమని
ఆశను ఊపిరి చేసుకుని
నమ్మిన నెచ్చెలి కోసమని
ఆశను ఊపిరి చేసుకుని
నరకాన్ని గెలిచినా ఫలితమిదా
గెలుపంతా ఓటమని
చెలి వలపంతా మోసమని
తెలిసిన హృదయం పగిలేను
పగతో సెగలై ఎగసేను
ఇది విషనాగుల లోకం
కసి బుస కొట్టే కాలం

ఓ లేడి కూన..ఈ వేటలోన 
అలిసేవు..పరుగులోన
ఎవరూ..తోడు రారు
నడిరేయే..నీకు తోడు
విధి నిను తరిమిన..ఈ ఆట వేట

No comments: