Thursday, November 13, 2014

అండమాన్ అమ్మాయి--1979

సంగీతం::KV.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య, ప్రభాకరరెడ్డి, రమాప్రభ,అన్నపూర్ణ

పల్లవి::

కోవెల నీకై వెలిసింది
ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా..నా దేవి తరలిరా 
ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా స్వామీ తరలి రా..నా స్వామి తరలిరా

చరణం::1

దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను
దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను
తిరునాళ్ళేపుడో రాక తప్పదని తేరును సిద్ధం చేసాను

దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను
దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను
రేపటి కోసం చీకటి మూసిన తూరుపులాగా ఉన్నాను
తూరుపులాగా ఉన్నాను

ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా..నా దేవి తరలిరా 

చరణం::2

నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే
నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే
ఓడ నడిపే తోడు దొరికే ఒడ్డు చేరే రోజు వచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
రేవులోకి చేరేలోగా దేవుడేదో అడ్డువేసే
ఆ..దేవుడేదో అడ్డువేసే

ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలిరా..నా స్వామీ తరలిరా 
రా దేవి తరలిరా..నా స్వామీ తరలిరా

No comments: