సంగీతం::A.A.రాజ్
రచన::ఆరుద్ర
గానం::S.జానకి
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,నాగభూషణం,రాజబాబు,పుష్పకుమారి,జ్యోతిలక్ష్మీ .
పల్లవి::
ఆహాహా..ఆహాహా..లలలలలాల..లాలా
ఓ బాయ్ ఓ బాయ్.. ఓహో..ఓ లౌలీ
అటుచూడు ఇటు చూడు అటుచూడు ఇటు చూడు
ఎటుచూస్తే అటు జంటలు బంగరు వలపుల పంటలు..ఆ..హా..ఆఆ
అటుచూడు ఇటు చూడు ఎటుచూస్తే అటు జంటలు
బంగరు వలపుల పంటలు ఆహా..ఆఆ..ఆఆ
చరణం::1
అందమైనదీ ఈ లోకం అంతు లేనిది అనురాగం
అందమైనదీ ఈ లోకం అంతు లేనిది అనురాగం
పచ్చని పరువం నాది నునువెచ్చని హృదయం నీది
పచ్చని పరువం నాది నునువెచ్చని హృదయం నీది
పడుచు దనాలు పరవశమొంది పండుగచేయాలి
అటుచూడు ఇటు చూడు ఎటుచూస్తే అటు జంటలు
బంగరు వలపుల పంటలు ఆహా..ఆఆ..ఆఆ
చరణం::2
తీయనైనదీ ఈ సమయం తేనె లూరునే మన ప్రణయం
తీయనైనదీ ఈ సమయం తేనె లూరునే మన ప్రణయం
నీకై పూచిన లతనోయ్ నిను విడలేని జతనోయ్నీ
కై పూచిన లతనోయ్ నిను విడలేని జతనోయ్
నిరంతరం నీ హృదంతరంలో నివాస ముంటానోయ్
అటుచూడు ఇటు చూడు ఎటుచూస్తే అటు జంటలు
బంగరు వలపుల పంటలు ఆహా..ఆఆ..ఆఆ
ఆహాహా..ఆహాహా.లలలలా లలాలలలా..ఆఆఆ
No comments:
Post a Comment