సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::S.P. బాలు
మల్వార్::రాగం
పల్లవి::
మంచు ముత్యానివో..ఓఓఓ
హంపి రతనానివో..ఓ..ఓ
తెలుగు వాకిట వేసిన..ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన
ముద్దబంతి..పువ్వువో..ఓఓఓ
మంచు ముత్యానివో..ఓఓఓ
హంపి రతనానివో..ఓఓఓ
తెలుగు వాకిట వేసిన..ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన
ముద్దబంతి..పువ్వువో..ఓఓఓ
మంచు ముత్యానివో..ఓఓఓఓఓ
చరణం::1
తెలుగు బడిలో..తొలుత చుట్టిన శ్రీకారానివో
జానపదమున తీపి కలిపిన..నుడికారానివో
గాలి వాటుకు..ఎండ పోటుకు..తాళలేని ఆకు చాటు పిందెవో
కూచిపూడి కొమ్మవో..కొండపల్లి బొమ్మవో
ప్రణయ మూర్తుల రాగ ప్రమిదకు..ప్రమిద ప్రమిదలో వెలుగు ప్రేమకు
ప్రతిగా..కృతిగా..ఆకృతిగా..నిలిచే సుందరివో
మంచు ముత్యానివో..ఓఓఓ
హంపి రతనానివో..ఓఓఓ
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన
ముద్దబంతి పువ్వువో..ఓఓఓ
మంచు ముత్యానివో..ఓఓఓఓఓ
చరణం::2
కాళిదాసుని కావ్యకవితకు..ఆకారానివో..ఓఓ
దేవరాయని శిల్ప చరితకు..ప్రాకారానివో..ఓఓఓ
రెప్ప పాటుకు..లిప్త చూపుకు..అందరాని అందమైన మెరుపువో
మెరుపులోని పిలుపువో..పిలుపులోని తలపువో
విరగబూసిన నిండు పున్నమికి..తిరగబోసిన పండు వెన్నెలకు
ప్రతిగా..కృతిగా..ఆకృతిగా..ఆఆ..నిలిచే సుందరివో
మంచు ముత్యానివో..ఓఓఓ
హంపి రతనానివో..ఓఓఓ
తెలుగు వాకిట వేసిన ముగ్గువో..
ముగ్గు నడుమన విరిసిన
ముద్దబంతి పువ్వువో..ఓఓఓ
మంచు ముత్యానివో..ఓఓఓఓఓ
No comments:
Post a Comment