Tuesday, October 18, 2011

భక్త తుకారాం--1973


























సంగీత::P. ఆదినారాయణరావు
రచన::వేటూరి
గానం::P. సుశీల
తారాగణం::A.N.R.శివాజీ గణేషన్,అంజలిదేవి,కాంచన,నాగభూషణం,ధూళిపాళ,సాక్షి రంగారావు.

పల్లవి::

ధాన్యలక్ష్మి వచ్చింది..మాయింటికి
మా కరువు తీరింది..ఈనాటికీ 
మా లక్ష్మి వచ్చిం..మాయింటికి
మా కరువు తీరింది..ఈనాటికీ
పాలసంద్రములోన పుట్టిన..నాతల్లి
పాలసంద్రములోన పుట్టిన..నాతల్లి
భాగ్యాలు కరుణించు..ఓ కల్పవల్లి
ధాన్యలక్ష్మి వచ్చింది..మాయింటికి
మా కరువు తీరింది..ఈనాటికీ 

చరణం::1

సువ్వి సువ్వన్నాలె సువ్వన్ననాలె..ఓయమ్మా 
సూరమ్మ మావారు ఎప్పుడొస్తారే..ఆఊ..ఆఊ
ఎన్ని భోగాలున్న ఎంతో భాగ్యమున్న..ఓయమ్మా 
మగనికన్న ఘనము కాదమ్మా..ఆఊ..ఆఊ
పిల్లల ఆకలి తల్లి ఎరుగును కాని..ఓయమ్మా
అడవుల్ల తిరిగే అయ్య ఏమెరుగూ
ఆ అయ్య ఏమెరుగూ..ఆఊ..ఆఊ

చరణం::2

జాజిరి జాజిరి జాజిరి..నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి 
జాజిరి జాజిరి జాజిరి..నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి 
చూడబోతే తాను సుందరీ..ఆడమంటే చాలు అల్లరీ
చూడబోతే తాను సుందరీ..ఆడమంటే చాలు అల్లరీ 
కట్టుకున్నవాడు నంగిరీ..సంతానమే బీర పందిరీ
కట్టుకున్నవాడు నంగిరీ..సంతానమే బీర పందిరీ

వండుకున్న అమ్మకు ఆయాసం
దండుకున్నమ్మకు పాయసం
వండుకున్న అమ్మకు ఆయాసం
దండుకున్నమ్మకు పాయసం 
జాజిరి జాజిరి జాజిరి..నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి

No comments: