Saturday, October 22, 2011

కన్నె మనసులు--1966



సంగీతం::KV.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

ఈ ఉదయం.. నా హృదయం...
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది
ఈ ఉదయం....


పడుచుపిల్ల పై ఎదలా పలుచని వెలుగు పరచింది
కొండల కొనల మలుపులలో...
కొత్త వంపులే చూసింది...

ఈ ఉదయం.. నా హృదయం...
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది
ఈ ఉదయం..ఊఊఊ..


చిగురాకులతో చిరుగాలి సరసాలాడి వచ్చింది
చక్కిలి గింతలు పెట్టింది
వేసవికే చలి వేసింది... ఓ....ఓ...

ఈ ఉదయం.. నా హృదయం...
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది
ఈ ఉదయం..ఊఊఊ..

సరసున జలకాలాడే దేవరో
జాబిలి వెంట తిప్పేదేవరో
రేయిని సింగారించే కలువో
పగలే వగలు రగిలే కమలమో

ఈ ఉదయం.. నా హృదయం...
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది
ఈ ఉదయం..ఊఊఊ..

No comments: