సంగీతం::M S విశ్వనాథన్
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::కృష్ణంరాజు,జమున, చంద్రమోహన్,జగ్గయ్య,సత్యనారాయణ,
జ్యొతిలక్ష్మి,అల్లు రామలింగయ్య
పల్లవి::
సిగ్గోలే సిగ్గు సిగ్గు..సెప్పుకుంటే సెడ్డ సిగ్గు
ఆ..ఓ..షషషషషషా

కిందసూసి పైనసూసి ముందుసూసి యనకసూసి కన్నుగీటి
మందిలోన సందుసూసి..బుగ్గమీద ముద్దరేసి ఎల్లాడే

చరణం::1
లాలరీ లాలరీ
తప్పునాది కాదయ్యో..నేనొప్పుకోనూ లేదయ్యో
ఓర ఓరకెల్లి నేను ఒంటిగా..నిలుసుంటే సచ్చినోడూ

వచ్చి వచ్చి వళ్ళు వళ్ళు తగిలించి ఎచ్చచేసిపోయాడే
సిగ్గోలే సిగ్గు సిగ్గు..సెప్పుకుంటే సెడ్డ సిగ్గు
చరణం::2
గుంపువదలి వచ్చాను..నా గుడిసె తెరిసీ వుంచాను
బొట్టుపెట్టి కాటుకెట్టి కొప్పెట్టి పూలెట్టి కూసున్నా

మీదికేసి సూసి సూసి యిసుగేసి సాపేసి తొంగున్నా
సిగ్గోలే సిగ్గు సిగ్గు సెప్పుకుంటే సెడ్డ సిగ్గు
చరణం::3
రాతిరంతా మేల్కొన్నా నా రాతయింతేననుకున్నా
సాపమీద దొర్లి దొర్లి సల్లంగ నిదరొస్తే సోగ్గాడూ

పిలిసినట్టు తోసి నేను..ఉలికిపడిలేసి సూస్తే ఉత్తిదేనే
ఉలికిపడిలేసి సూస్తే ఉత్తిదేనే
సిగ్గోలే సిగ్గు సిగ్గు సెప్పుకుంటే సెడ్డ సిగ్గు
ఆ..ఓ..షషషషషషా
కిందసూసి పైనసూసి ముందుసూసి యనకసూసి కన్నుగీటి
మందిలోన సందుసూసి..బుగ్గమీద ముద్దరేసి ఎల్లాడే
No comments:
Post a Comment