Wednesday, September 22, 2010

రామరాజ్యం--1973




సంగీతం::ఘంటసాల
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::జగ్గయ్య,సావిత్రి,S.V.రంగారావు,గుమ్మడి, చంద్రమోహన్, రాజబాబు 

పల్లవి::

గెలుపుల రాణిని కదరా..ఇక నిను వదలను పదరా
ముసి ముసి నవ్వుల..మిఠారి చూపుల
గుమ్మెత్తిస్తారా..ఆ..సమయమిదే..రా..రా            
గెలుపుల రాణిని కదరా..ఇక నిను వదలను పదరా
ముసి ముసి నవ్వుల..మిఠారి చూపుల
గుమ్మెత్తిస్తారా..ఆ..సమయమిదే..రా..రా   

చరణం::1

కన్ను మూసుకున్నావంటే..నే కల్లోవచ్చి ఊపేస్తా
కళ్ళు తెరచి చూశావంటేనే..నీ వొళ్ళో వచ్చి వాలేస్తా
మనసూ మనసూ కలిపేస్తా..మైకంలో నిను తేలుస్తా
మనసూ మనసూ కలిపేస్తా..మైకంలో నిను తేలుస్తా
వెచ్చవెచ్చనీ కౌగిటిలోనా..ముచ్చటలన్నీ తీరుస్తా   
గెలుపుల రాణిని కదరా..ఇక నిను వదలను పదరా

చరణం::2

ఎన్నడు నీవు చూడని స్వర్గం..ఎదురుగ యిపుడే చూపిస్తా 
నవనవలాడే నా వయసంతా..నీ చేతులకే అందిస్తా
తేనె వాగులో ఈదిస్తా..ఆనందంలో మురిపిస్తా
తేనె వాగులో ఈదిస్తా..ఆనందంలో మురిపిస్తా
ఇలాంటి సుఖమూ ఎక్కడ లేదని..నీ చేతనే చెప్పిస్తా 
గెలుపుల రాణిని కదరా..ఇక నిను వదలను పదరా
ముసి ముసి నవ్వుల..మిఠారి చూపుల
గుమ్మెత్తిస్తారా..ఆ..సమయమిదే..రా..రా

No comments: