Director::బాపు
సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరి
గానం::S.P.బాలు
పల్లవి::
అ అ అ అ అ అ అ అ
కుక్కుటేశ్వర కునుకు సాలురా..నీవు లేవరా నిదర లేపరా
కుక్కుటేశ్వర కునుకు సాలురా..నీవు లేవరా నిదర లేపరా
కొక్కోరుక్కో..మేలుకో..కొక్కోరుక్కో..మేలుకో
కుక్కుటేశ్వర కునుకు సాలురా..నీవు లేవరా నిదర లేపరా
చరణం::1
ఆటీను ఇస్పేట్ డైమను రాణుల అలకదీర్చర అప్పుజేసి
కాఫీ సిగరెట్టు ఉప్మా పెసరట్టు పరువు పెంచర పద్దురాసి
సిగ్గు శరములు గాలికి వదిలి క్లబ్బుకి కదలక లెమ్మి ఇక లెమ్మి
రమ్మి ఇటు రమ్మి..నిను నీవే సేయగ దొమ్మి
నీ కనులకు పొరలే కమ్మి..సాటి ఆటకులనమ్మి
నాటి ఆస్తి తెగనమ్మి..ఢంకా పలాసుగా కుంకా కులాసగ
కోకో కో కో కో క్కో క్కో కో క్కో క్కో క్కో..కొక్కోరుక్కో..మేలుకో
ఓ ఓ..మేలుకో..
కుక్కుటేశ్వర కునుకు సాలురా నీవు లేవరా నిదర లేపరా
చరణం::2
మధు దేవి గుడి తలుపు తెరిసేటి యేళాయే నిదర ఈరా ఇంక మేలుకో
పానకాలస్సామి పూనకేశ్వరితోన ఊరేగు యేళాయే మేలుకో
గోలి సోడా బుడ్డి కెవ్వుమంటున్నాది జాలి సూపి సామి మేలుకో
బారులో దేశి ఇదేశీయ మద్యాలు పద్యాలు పాడేను మేలుకో
తిన్నదరిగే లాగ దున్నపో మారాజు కుడితి దాగుదువు మేలుకో
మేలుకో మేలుకో మేలుకో..కొక్కోరుక్కో..హో హో హో..మేలుకో..అ
అః కొక్కో
చరణం::3
అల్లరెందుకు రారా నల్ల గోపాల
సిందులాపర సామి సిన్ని గోవింద
అల్లరెందుకు రారా నల్ల గోపాల
సిందులాపర సామి సిన్ని గోవింద
అమ్మ కడుపే సల్లగ మాయమ్మవలపే వెన్నగా
రవ్వ సేయక తాన మాడరా మువ్వ గోపాలా
నలుగు పెట్టే ఏళ అలకల్లు ముద్దు
సమురు బెట్టే సెయ్యి దరువుల్లు ముద్దు
నలుగెట్టిన పిండి నాకు గణపతిగా
ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా
తల అంటూ పోసేటి రాంబంటు పాట
కలగంటూ పాడాల కలవారి ఇంట
రాలచ్చి ఇచ్చింది ఈ రాస పుటక
శీలచ్చి దోచింది నీ సేతి ఎముక
మీ ఉప్పు తిని అప్పు పడ్డానుగనక
తీర్చలేని ఋణము తీర్చుకోమనకా
RamBantu--1996
Director::Bapu
Music::M.M.Keeravaani
Lyrics::Veeturi
Singer's::S.P.Balu
:::
a a a a a a a a ..
Kukkuteswaraa kunuku saaluraa neevu levaraa nidura leparaa
Kukkuteswaraa kunuku saaluraa neevu levaraa nidura leparaa
kokkorokko meluko..kokkorokko meluko
Kukkuteswaraa kunuku saaluraa neevu levaraa nidura leparaa
:::1
Aatiin, ispet, daimond ranula alaka deerchara appu chesi
coffee, cigarette, upma, pesarattu paruvu penchara paddu raasi
siggu, sharamulu gaaliki vadili clubbuki kadalaga lemmi ika lemmi
rammi itu rammi ninu neeve seyaga dommi
ne kanulaku porale kammi..saati aatakula nammi
naati aasti teganammi..dhankaa palaasuga kunkaa kulaasaga
ko ko ko ko ko kokko kko kko kko kokkarakko..meluko
o o..meluko
Kukkuteswaraa kunuku saaluraa neevu levaraa nidura leparaa
:::2
Madhu devi gudi talupu teriseti yelaaye nidara eeraa inka meluko
paanakaala saami puunakeshwari tona uregu yelaye meluko
goli sodaa buddi kevvumantunnaadi jaali suupi saami meluko
baarulo deshii, idesheeya madyaalu padyalu paadenu meluko
tinnadarigedaaka dunnapo maaraaju kuditi taaguduvu meluko
meluko meluko meluko..kokkarako..ho ho ho..meluko..aa aahaa..kokko
:::3
Allarenduku rara nalla gopalaa
sindulaapara saami sinni govindaa
Allarenduku rara nalla gopalaa
sindulaapara saami sinni govindaa
amma kadupe sallagaa ma yamma valape vennagaa
ravva seyaka taanamaadaraa muvva gopalaa
nalugu pette vela alakallu muddu
nalugettina pindi naku ganapatigaa
muggurammala bidda neeve raghupatigaa
tala antu poseti raambantu paata
kalagantuu paadaala kalavari inta
raalachi ichindi ee raasa putaka
seelachi dochindi nee seeti yemuka
me uppu tini appu paddaanu ganaka
teerchaleni runamu teerchukomanaka
No comments:
Post a Comment