సంగీతం::M.S. విశ్వనాథన్
రచన::దాసరి
గానం::P.సుశీల
పల్లవి::
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా..తేనెలా..దేశ భాషలందు లెస్సగా
పాలలా..తేనెలా..దేశ భాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
తీపి తీపి తెలుగూ..ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
చరణం::1
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగూ
తెలుగూ..ఊఊఊఊఊఊఊ..ఆ ఆ ఆ ఆ ఆ
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగూ
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగూ
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగూ
కూచిపూడి నర్తన..త్యాగరాజ కీర్తనా
కూచిపూడి నర్తన..త్యాగరాజ కీర్తనా
అడుగడుగు అణువణువూ అచ్చ తెలుగు
జిలుగు తెలుగు..సంస్కృతికే ముందడుగు
తీపి తీపి తెలుగు..ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా..కృష్ణవేణి పొంగులా
చరణం::2
పోతులూరి వీరబ్రహ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగూ
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగూ
కందుకూరి సంస్కారం..చిలకమర్తి ప్రహసనం
కందుకూరి సంస్కారం..చిలకమర్తి ప్రహసనం
నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు
జాతికిదే బావుటా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా..తేనెలా..దేశ భాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
No comments:
Post a Comment