Monday, August 31, 2009

రైతు కుటుంబం--1972

సంగీతం::T. చలపతిరావు
రచన::D.సినారె
గానం::ఘంటసాల,P.సుశీల   

పల్లవి::

ఊరంతా అనుకుంటున్నారు..ఏమనీ ఏమనీ ఏమనీ ఏమనీ
సొగసైన చిన్నవాడికి గడుసైన చిన్నదానికి
ముడి ఏదో బిగిసిందనీ..హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఊరంతా అనుకుంటున్నారు..మన ఊరంతా అనుకుంటున్నారు

ఊరంతా అనుకుంటున్నారు..ఏమనీ ఏమనీ..ఏమనీ ఏమనీ
చారడేసి కళ్ళదానికి దోరవయసు చిన్నవాడికి
జత బాగా కుదిరిందనీ..హొయ్ హొయ్ హొయ్ హోయ్ హొయ్
ఊరంతా అనుకుంటున్నారు..మన ఊరంతా అనుకుంటున్నారు

చరణం::1

చిన్నోడి వాలకం చిత్రంగా ఉందనీ
సన్నజాజులంటేనే సరదా పెరిగిందనీ
మంచె మీద నిల్చొన్న..ఇంటికాడ కూర్చున్నా
మంచె మీద నిల్చొన్న..ఇంటికాడ కూర్చున్నా
పూలరంగడి మనసంతా ఆ బుల్లెమ్మ మీదే ఉందనీ

ఊరంతా అనుకుంటున్నారు..ఏమనీ ఏమనీ ఏమనీ ఏమనీ
సొగసైన చిన్నవాడికి గడుసైన చిన్నదానికి
ముడి ఏదో బిగిసిందనీ..హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఊరంతా అనుకుంటున్నారు..మన ఊరంతా అనుకుంటున్నారు

చరణం::2 

చిట్టెమ్మ చూపంతా చుక్కలోనే ఉందనీ
కళ్ళకు రాసే కాటుకా చెంపకు పుసేస్తుందనీ
అద్దమైన చూడదనీ నిద్దరైన పోదనీ
అద్దమైన చూడదనీ నిద్దరైన పోదనీ
పెళ్ళైతేనే కానీ ఆ పిల్లకు పిచ్చి కుదరదనీ
ఊరంతా అనుకుంటున్నారు..ఏమనీ ఏమనీ ఏమనీ ఏమనీ
సొగసైన చిన్నవాడికి గడుసైన చిన్నదానికి
ముడి ఏదో బిగిసిందనీ..హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఊరంతా అనుకుంటున్నారు..మన ఊరంతా అనుకుంటున్నారు

No comments: