సంగీతం::T. చలపతిరావు
రచన::D.సినారె
గానం::ఘంటసాల, L.R.ఈశ్వరి
పల్లవి::
ఓయమ్మో..ఓయమ్మో..
కన్నెపిల్ల పక్కనుంటే కళ్ళు తేల వేస్తాడు ఓయమ్మో..ఓ
జున్నుముక్క చేతికిస్తే నీళ్ళునములుతుంటాడు
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
ఈ బుల్లోడు పాతికేళ్ల బుజ్జాయిలే..ఏ..ఏ
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
ఓయబ్బో..ఓయబ్బో..ఓ
కుర్రదాని కొంటెవయసు కూతవేసి పిలిచింది..అయ్యబ్బో..ఓ
చేయి పట్టుకుందమంటే జింకలాగ బెదిరింది
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
ఈ బుల్లెమ్మ సంక దిగని పాపాయిలే..ఏ..ఏ
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
చరణం::1
కన్నుగీటినా కదలనోడు..చెంపమీటినా చెరదనోడు
ఏ గాలి సోకిందో ఎగిరెగిరిపడ్డాడు
ఏ నీడి తాకిందో ఇలా పాలిపోయాడు
తాయతు కడితే కానీ దారికి రాడోయమ్మా
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
సరసాలంటే ఎరగనోడినా..చక్కిలిగింతే తెలియనోడినా
ఏదో పసిపిల్లవని ఇన్నాళ్లు కైసానే
సమయం కుదిరేదాకా తమాయించుకున్నానే
మూడుముళ్ళ పగ్గమేసి ముట్టే పొగరు తీస్తానే
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
చరణం::2
హా..ఎన్ని నేర్చెనే చిన్నవాడు..ఎక్కడిదమ్మో ఇంత జోరు
మాటలు చూస్తేనేమో కోటలు దాటేనమ్మా
వాటం చూస్తేనేమో పోట్ల గిత్త ఓయమ్మ
తీరా దగ్గరకొస్తే నీరైపోతాడమ్మా
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
కదను తొక్కుతున్నాది గజ్జల గుర్రం
అదను చూసి వెయ్యాలి వలపుల కళ్ళెం
కువకువలాడే కోర్కెల కొరడా ఝులిపించాలి
మెరమెరలాడే వయసును పరుగులు తీయించాలి
అప్పుడు మొదలవుతుందే అమ్మాయి అసలు కథా
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
ఈ బుల్లెమ్మ సంక దిగని పాపాయిలే...ఏ..ఏ..
జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే..ఏ..జిల్లాయిలే
1 comment:
రైతు కుటుంబంలోని అన్నీ వీడియో పాటలను ఇక్కడ వీక్షించగలరు.
https://www.youtube.com/playlist?list=PLMWZNMZrl8xeEahUlxgazl_5J4rMF3o35
ధన్యవాదాలు.
Post a Comment