సంగీతం::ఘంటసాల
రచన::మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం::ఘంటసాల,P.సుశీల,P.లీల,కోమల,వైదేహి,పద్మ,మల్లిక్,మాధవపెద్ది.
Film Director By::Vedantam Raghavaiah
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,కృష్ణకుమారి,C.H..నారాయణరావు,S.V.రంగారావు,
B.సరోజాదేవి,గుమ్మడి,రమణారెడ్డి,G.వరలక్ష్మి,రాజశ్రీ,కృష్ణకుమారి,కాంతారావు,చిత్తూరునాగయ్య.
గిరిజా కల్యాణం::యక్షగానం
రాగమాలిక
నాట::రాగం::
అంబా పరాకు.. దేవీ పరాకు
మమ్మేలు మా..శారదంబా పరాకు
ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా..గజాననా
బహుపరాక్..బహుపరాక్
చండభుజాయమండల..దోధూయమాన వైరిగణా..షడాననా
బహుపరాక్..బహుపరాక్
మంగళాద్రి నారసింహ..బహుపరాక్..బహుపరాక్
బంగరుతల్లి కనకదుర్గ..బహుపరాక్..బహుపరాక్
కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ..బహుపరాక్..ఆఆఆ
శ్రీ::రాగం::
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా
లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశమయ్యే
అవధరించరయ్యా విద్యల..నాదరించరయ్యా
ఈశుని మ్రోల..ఆ..హిమగిరి బాల..ఆ
ఈశుని మ్రోల హిమగిరి బాల..ఆ
కన్నెతనము ధన్యమయిన గాథ
అవధరించరయ్యా విద్యల..నాదరించరయ్యా
కణకణలాడే తామసాన కాముని రూపము..బాపీ
తన కాముని రూపము..బాపీ..ఆ..కోపీ
తాపముతీరి కనుతెరిచి..తను తెలిసీ
తన లలనను..పరిణయమైన ప్రబంధము
అవధరించరయ్యా విద్యల..నాదరించరయ్యా
కాంభోజి::రాగం ::
రావో రావో లోల లోల లోలం..ఓ
రావో రావో లోల లోల లోలం బాలక రావో..ఓఓఓఓ
లోకోన్నత మహోన్నతుని..తనయ మేనాకుమారి
లోకోన్నత మహోన్నతుని..తనయ మేనాకుమారి
రాజ సులోచన రాజాననా
రావో రావో లోల లోల లోలం బాలక రావో..ఓఓఓఓ
అఠణ::రాగం ::
చెలువారు మోమున..లేలేత నగవులా
కలహంస గమనాన..కలికీ ఎక్కడికే
మానస సరసినీ మణిపద్మ దళముల
రాణించు అల రాజ హంస సన్నిధికే
వావిలి పూవుల మాలలు గైసేసి
వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే
వయ్యారి నడల బాలా ఎక్కడికే
కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అలదేవ దేవు సన్నిధికే
వసంత::రాగం::
తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ
తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ
తగదిదీ..ఈ
అండగా..ఆ..మదనుడుండగా..ఆ
మన విరిశరముల పదనుండగా
నిను బోలిన కులపావని తానై
వరునరయగ బోవలెనా..ఆఆఆ
తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ
తగదిదీ..ఈ
కోరినవాడెవడైనా..ఎంతటి ఘనుడైనా
కోరినవాడెవడైనా..ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి..నీ దాసు చేయనా
హ్హా హ్హా హ్హా..
తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ
తగదిదీ..ఈ
రీతిగౌళ::రాగం::
ఈశుని దాసుని చేతువా..అపసద..అపచారము కాదా
ఆఆఆఆఅ..ఈశుని దాసుని చేతువా
కోలల కూలెడు అలసుడు కాడూ..ఆదిదేవుడే అతడూ
సేవలు చేసి ప్రసన్నుని చేయ
నా స్వామి నన్నేలు నోయీ..ఈఈఈఈ
నీ సాయమే వలదోయీ..ఈ..ఈశుని దాసుని చేతువా
బేగడ::రాగం::
కానిపనీ మదనా కాని పనీ మదనా
అది నీ చేతకానిపనీ మదనా
అహంకరింతువ..హరుని జయింతువ
అహంకరింతువ..హరుని జయింతువ
అది నీ చేతకాని పని మదనా..కానీపనీ మదనా
సరస్వతి::రాగం::
చిలుక తత్తడి రౌత..ఎందుకీ హూంకరింతా
చిలుక తత్తడి రౌత..ఎందుకీ హూంకరింతా
వినకపోతివా..ఆ..ఇంతటితో..వినకపోతివా..ఇంతటితో
నీ విరిశరముల..పని సరి..సింగిణి పని సరి
తేజోపని..సరి..చిగురికి నీ..పని..సరి మదనా
చిలుక తత్తడి రౌత..ఎందుకీ హూంకరింతా
చిలుక తత్తడి రౌత..ఆ
హిందోళం::రాగం::
సామగ సాగమ సాధారా..శారద నీరద సాకారా
దీనా ధీనా ధీసారా..ఆ..సామగ సాగమ సాధారా
ఇవె కైమోడ్పులు..ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా..ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి..ఈశా మహేశా
సామగ సాగమ సాధారా..ఆ
దీనా ధీనా ధీసారా..సామగ సాగమ సాధారా
Music::Interlude::హంసధ్వని::రాగం
సావేరి::రాగం::
విరులన్ నిను పూజచేయగా..విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ..ఊఊఊ
కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా..ఆ
మరుడే పున రూపున వర్థిలుగా..ఆ
రతి మాంగల్యము రక్ష సేయరా..ఆ..ప్రభూ..ఆ..పతిభిక్ష..ప్రభూ..ఊఊఉ
సామ::రాగం యక్షరాగం::
అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో..ఓఓఓఓ
మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేకొనవో
శరణంభవ శరణంభవ శరణంభవ స్వామీ
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామీ..ఈ..
మధ్యమావతి::రాగం::
బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం
జగమేలు తండ్రికి జయమంగళం
విరులచే వరునిచే కరముచే కొనజేయు జగమేలు తల్లికి జయమంగళం
జగమేలు తల్లికి జయమంగళం
సురటి::రాగం::
కూచెన్నపూడి భాగవతుల సేవలందు దేవదేవా..ఆ
శ్రీవేణుగోపాలా జయమంగళం..
త్రైలోక్య మందారా..ఆ..శుభమంగళం..మ్మ్ మ్మ్
No comments:
Post a Comment