Wednesday, August 20, 2008

ముద్దుబిడ్డ--1956


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::జమున,లక్ష్మీరాజ్యం,నాగయ్య,రమణారెడ్డి,జగ్గయ్య,పేకేటి, C.S.R. ఆంజనేయులు

పల్లవి::

చూడాలని ఉంది 
అమ్మా..చూడాలని ఉంది 
నిన్నూ..చూడాలని ఉంది 
పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి
అమ్మా..చూడాలని ఉంది

చరణం::1

కంటికి నిద్దర రాదే..నే తింటే నోటికిపోదే
చేశా చిన్న తప్పు..నువ్వు వేశావెంతో ఒట్టు 
ఒకసారి మాత్రం నిన్ను చూస్తే చాలులే..అమ్మా
చూడాలని ఉంది..నిన్నూ చూడాలని ఉంది


చరణం::2

కాళ్ళు అటే పోయేనే..నా కళ్ళు అటే లాగేనే
చూడకపోతే దిగులు..నిన్ను చూస్తే ఏమౌతావో
చూడటం మరి కూడదంటే.. మరి ఏడుపొస్తుందమ్మ

చూడాలని ఉంది 
అమ్మా..చూడాలని ఉంది 
నిన్నూ..చూడాలని ఉంది 
పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి
అమ్మా..చూడాలని ఉంది

No comments: