Thursday, July 26, 2012

మంత్రిగారి వియ్యంకుడు--1983




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

మనసా..శిరసా..నీ నామము చేసెదనీ వేళ
మనసా..శిరసా..నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో..శివశంకర వణికింపగ శరణని
మనసా..శిరసా..నీ నామము చేసెదనీ వేళ

చరణం::1

తాండవమాడే నటుడైనా..ఆ..ఆ..ఆ..తలిచిన వేళ హితుడేలే
తాండవమాడే నటుడైనా..తలిచిన వేళ హితుడేలే
గిరిజనులే ఆ శివున్ని గురి విడక ధ్యానించు
ఆ శివ శంకర నామము చేసిన నీకిక చింతలు ఉండవులే
బెరుకుమాని ప్రేమించి..ప్రేమ మీద లాలించె
యముడు చూపు తప్పించి..తప్పులున్న మన్నించేయ్
ఇష్టదైవమతని మీద దృష్టిని నిలిపి శివుని పిలవ వేళ
ఓ మనసా..శిరసా..నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో..శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

చరణం::2

సప్త మహర్షుల సన్నిధిలో..గరి రిస సని నిద దప
పగమ పదస పద సరిగమ గ..సప్త మహర్షుల సన్నిధిలో
సప్త మహర్షుల సన్నిధిలో..సప్త స్వరాల ప్రియ శృతిలో
గౌరి వలె ఆ శివుని గౌరవమే కాపాడు
ఆ నవజాతకు ఈ భువజాతకు కలిసిన జాతకమీ వరుడే
లంక చెరను విడిపించి..శంకలన్నీ తొలగించి
ఈసులన్నీ కరిగించి..నీ సుశీల మెరిగించె
లగ్నమైన మనసుతోడ పెళ్ళికి లగ్నమిపుడు కుదురు వేళ
ఓ మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో..శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

No comments: