సంగీతం::K.V.మహాదేవన్
రచన::సిరివెన్నెల
గానం::K.J.యేసుదాస్
ఆభేరి ::: రాగం
పల్లవి::
తెలవారదేమో స్వామీ
తెలవారదేమో స్వామీ
నీ..తలపుల..మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ
నీ..తలపుల..మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ
చరణం::1
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ:::
చరణం::2
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ
మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ గ మా ప ని
తెలవారదేమో...
స ని ద ప మా ప మా గ ని స గ మా
తెలవారదేమో స్వామీ
ప ని ద ప మా గ మా
ప స ని ద ప మా గ మా
ప స ని రి స గ రి మా గ రి స రి ని స
తెలవారదేమో స్వామీ
No comments:
Post a Comment