సంగీతం::S రాజేశ్వరరావు
రచన::దాశరథి
గానం::P. సుశీల
దర్శకత్వం::బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి
తారాగణం::అంజలీదేవి,రాంమోహన్,చంద్రమోహన్,విజయనిర్మల,వాణిశ్రీ,నీరజ,త్యాగరాజు,రాధారాణి.
పల్లవి::
కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఎవరిరూపో..ఎవరిరూపో..కనులలోన మెరిసినది
నా..ఆ..బుగ్గలపై..తొలిసిగ్గు..తొణికినది
కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది
చరణం::1
విరబూసే పూలూ సరదాలూ రేపే
వేయీ వసంతాలు ఉయ్యాలలూపే
వేయీ వసంతాలు ఉయ్యాలలూపే
వలపులతో..ఓ..వెచ్చని తలపులతో..ఓ
వలపులతో..ఓ..వెచ్చని తలపులతో
ఒయ్యారి నా మనసు సయ్యాటలాడే..ఏ
కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది
చరణం::2
ఆఆఆ..ఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఅ
తెలిమబ్బుమీద..తేలేను నేను
చిరుగాలి కెరటాల..సోలేను నేను..తూలేను నేను
తారకనూ..తీయని కోరికనూ
తారకనూ..తీయని కోరికనూ
మిన్నేటి నావకూ చుక్కాని నేనూ..ఊ
కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది
ఎవరిరూపో..ఎవరిరూపో..కనులలోన మెరిసినది
నా..ఆ..బుగ్గలపై..తొలిసిగ్గు..తొణికినది
కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది
ఆఅ ఆహా ఓఓఓ ఓహో
ఆఅ ఆహా ఓఓఓ ఓహో
కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది
No comments:
Post a Comment