సంగీతం::రమేష్ నాయుడు
రచన::సినారె
గానం:: L.R. ఈశ్వరి
తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి
పల్లవి::
మావిడి తోపుల్లోనా..మాపటేల మాటేసి
చిక్కుడు పాదుకాడ..చీకటేల పట్టేసి
మావిడి తోపుల్లోనా..మాపటేల మాటేసి
చిక్కుడు పాదుకాడ..చీకటేల పట్టేసి
చెప్పలేని రుచులెన్నో..చిటికెలోన చూపించి
చెప్పలేని రుచులెన్నో..చిటికెలోన చూపించి
చూపించి..
మాయ చేసి పోతివిరో నాగులూ..ఊఊఊ..
నా మాట మరచిపోతివిరో..నాగులు
ఓలమ్మో..ఓలమ్మో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
చరణం::1
నిన్నే కావాలని..ఎన్నుకొంటిని
నీ చుట్టూ నా మనసే..అల్లుకొంటిని
రేకెత్తే నా సొగసే..నీకు ముడుపు కడితిని
ఇన్నీ చేసినదాన్నీ..ఏమెరుగని చినదాన్నీ
ఇన్నీ చేసినదాన్నీ..ఏమెరుగని చినదాన్నీ
హుమ్..హుమ్..
మాయ చేసి పొతివిరో..నాగులూ..ఊఊఊ
నా మాట మరచిపోతివిరో..నాగులు
ఓలమ్మో..ఓలమ్మో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
చరణం::2
నట్టింట ఒంటరిగా..కాచుకొంటిని
నడిరాతిరి ఉసురుసురు అంటూ..వేచి ఉంటిని
ఆకు చప్పుడైనా..నీ అడుగుల్లే అనుకొంటిని
నిన్నే నమ్మినదాన్నీ..నీకే నచ్చినదాన్నీ
నిన్నే నమ్మినదాన్నీ..నీకే నచ్చిన దాన్నీ
కాదు మరి..
మాయచేసి పోతివిరో..నాగులూ..ఊఊఊఊ
నా మాట మరచిపోతివిరో..నాగులు
ఓలమ్మో..ఓలమ్మో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
చరణం::3
తొలినాటి తొందరలు..ఏమాయెరా
ఆ బులిపాలు మురిపాలు..కరువాయెరా
నిద్దర పోతూ ఉన్నా..ఆ ముద్దులే గురుతాయెరా
చిగురాకు లాంటిదాన్నీ..వగలేది లేనిదాన్నీ
చిగురాకు లాంటిదాన్నీ..వగలేది లేని దాన్నీ
హుమ్..పాపం..
మాయ చేసి పోతివిరో..నాగులూ..ఊఊఊ
నా మాట మరచిపోతివిరో..నాగులు
ఓలమ్మో..ఓలమ్మో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
No comments:
Post a Comment