Sunday, April 03, 2011

బంగారు పాప--1954
























సంగీతం::అద్దెపల్లి
రచన::దేవులపల్లి
గానం::A.M.రాజ,P.సుశీల
తారాగణం::S.V. రంగారావు,జగ్గయ్య,కృష్ణకుమారి,రామశర్మ,రమణారెడ్డి,హేమలత 

పల్లవి::

ఈఈఈ..వెన్నెల మల్లి విరిపందిరిలోన..ఆ ఆ ఆ 
చిరునవ్వుల హారతి..శేఖరుకీనా..ఆ ఆ ఆ 

వెన్నెల పందిరిలోన..చిరునవ్వుల హారతులీన
పండు వెన్నెల..మనసు నిండా వెన్నెల
కొండపైన కోనపైన..కురిసే వెన్నెల..విరిసే వెన్నెల

చరణం::1

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మబ్బుల దారి..ఈ..ఓ బాటసారి
నీ వొంటరి..పయణం కాదా
నీ జంటగ..నీ సఖి లేదా 
నీ వొంటరి..పయణం కాదా
నీ జంటగ..నీ సఖి లేదా

నాకై వేచె..నవ్వులు పూచె 
నా చెలి కన్నుల..కాచే వెన్నెల
పైన వెన్నెల..మనసులోన వెన్నెల
పైన లోన చందమామ..పరచే వెన్నెల
పాలవెన్నెల

చరణం::2

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
చల్లని రేయి..మెలమెల్లని..గాలి
అలనల్లన..మమతలు..మూగే 
తియతీయని..తలపులు..రేగే
అలనల్లన..మమతలు..మూగే 
తియతీయని..తలపులు..రేగే

తీయని వలపులు..తెచ్చేదెవరు
నాకై పరుగున..వచ్చేదెవరొ
పండు వెన్నెల..మనసు నిండా వెన్నెల
కొండపైన..కోనపైన..కురిసే వెన్నెల..విరిసే వెన్నెల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

No comments: