Wednesday, March 05, 2014

పూజాఫలం--1964
























సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని, జగ్గయ్య, జమున,సావిత్రి,గుమ్మడి, ఎల్. విజయలక్ష్మి,రమణారెడ్డి,రాజశ్రీ   

పల్లవి::

సుందర సురనందన వన మల్లి..జాబిల్లి
అందేనా ఈ చేతులకందేనా..ఆ..ఆ
అందేనా ఈ చేతులకందేనా..ఆ..ఆ
చందమామ ఈ కనులకు విందేనా..ఆ..ఆ
అందేనా ఈ చేతులకందేనా..ఆ..ఆ

చరణం::1

ఆ మడుగున కనిపించి..నా మనసున నివశించి
అంతలోనే ఆకాశపు అంచుల విహరించె..ఏ..ఏ
చందమామ ఈ కనులకు విందేనా..ఆ..ఆ..ఆ

చరణం::2

తలపు దాటనీక మనసు తలుపు వేయగలనుగాని
నింగి పైకి ఆశలనే నిచ్చెనేయగలను గాని..ఈ..ఈ
కొలనులోన కోర్కెలనే అలలపైన ఊగే..ఏ..ఏ 
కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేనా..ఆ..ఆ..ఆ
చందమామ ఈ కనులకు విందేనా..ఆ..ఆ..ఆ

No comments: