Friday, March 05, 2010

పూజాఫలం--1964























సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం::P.సుశీల

పల్లవి::

నేరుతునో లేదో ప్రభూ..నీ పాటలు పాడా..
ఇది చల్లని వేళైనా..ఇది వెన్నెల రేయైనా
నిదుర రాదు కనులకు..శాంతి లేదు మనసుకు
మదిలో వేదన ఏదో..కదిలే రాధకు 
ఇది చల్లని వేళైనా

చరణం::1

నీ దయలాగున వెన్నెల..జగమంతా ముంచే
నీ మధుర ప్రేమా..యమున కడలంతా నింపే
మరి మరి ముల్లోకములను..మురిపించే స్వామీ
మనసు చల్ల పడ దాసికి..కనిపించవేమీ 
ఇది చల్లని వేళైనా

చరణం::2

నీ వేణువు కోసం..బ్రతుకంతా వీనులాయే
నీ దరిశనమునకై..ఒడలంతా కనులాయే  
బడలే బ్రతుకున ఆశలు..వెలిగించే దేవా
కదలే వీణియ తీగలు..సవరించి పోవా
ఆ ఆ ఆ ఆ ఆ 
ఇది చల్లని వేళైనా..ఇది వెన్నెల రేయైనా

No comments: