సంగీతం::K.V.మహాదేవన్
రచన:: ఆత్రేయ
గానం::S.P.బాలు , P.సుశీల.
Film Directed By::K.Raghavendra Rao
తారాగణం::కృష్ణంరాజు,శ్రీదేవి,జయసుధ,రాధిక,చలపతిరావు
పల్లవి::
వెలుగుకి ఉదయం..చెలిమికి హృదయం
నొసటికి తిలకం..కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..జన్మ జన్మ ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా..జన్మ జన్మ ఋణాలుగా
వెలుగుకి ఉదయం..చెలిమికి హృదయం
నొసటికి తిలకం..కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..జన్మ జన్మ ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా..జన్మ జన్మ ఋణాలుగా
చరణం::1
చేయి చేయి కలిసి చేసిన బాసకి..ఊపిరి నీవయినావు
చెలిమి కలిమి అల్లిన తీగకి..పందిరి నీవయినావు
చేయి చేయి కలిసి చేసిన బాసకి..ఊపిరి నీవయినావు
చెలిమి కలిమి అల్లిన తీగకి..పందిరి నీవయినావు
నా ఆశకి రూపం నీవయి..నా ఆశయ దీపమ నీవయి
నా ఆశకి రూపం నీవయి..నా ఆశయ దీపమ నీవయి
నీవు నేను మనమవుదాం..నీవు నేను మనమవుదాం
మనమే మనకొక మతమవుదాం...
వెలుగుకి ఉదయం..చెలిమికి హృదయం
నొసటికి తిలకం..కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..జన్మ జన్మ ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా..జన్మ జన్మ ఋణాలుగా
చరణం::2
జీవం పోసే రాగం కోసం..వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం..వెదికిన రాగం నేను
జీవం పోసే రాగం కోసం..వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం..వెదికిన రాగం నేను
నీ మమతకి శృ తినే నేను..నీ నడకకి లయనే నేను
నీ మమతకి శృ తినే నేను..నీ నడకకి లయనే నేను
నేను నేనను ఇద్దరం..నేను నేనను ఇద్దరం
నిన్న రేపటి సంగమం...
వెలుగుకి ఉదయం..చెలిమికి హృదయం
నొసటికి తిలకం..కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..జన్మ జన్మ ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా..జన్మ జన్మ ఋణాలుగా
No comments:
Post a Comment